Telugu Global
Cinema & Entertainment

సుజీత్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఏమిటంటే..?

బాహుబలి సినిమాతో నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. కానీ ఆ సినిమా ఎఫెక్ట్ తో మరిన్ని ప్రాజెక్టులకు దూరమయ్యాడు. మరీ ముఖ్యమంగా సుజిత్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను కొన్ని నెలలుగా వాయిదా వేస్తున్నాడు. బాహుబలి తర్వాతైనా ఆ సినిమా సెట్స్ పైకి వస్తుందనుకుంటే అది కూడా జరగలేదు. దీంతో సుజిత్-ప్రభాస్ కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయిందనే ప్రచారం సాగింది. ఈ పుకార్లకు స్వయంగా ప్రభాస్ ఫుల్ స్టాప్ పెట్టాడు. అంతేకాదు.. సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ […]

సుజీత్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఏమిటంటే..?
X

బాహుబలి సినిమాతో నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. కానీ ఆ సినిమా ఎఫెక్ట్ తో మరిన్ని ప్రాజెక్టులకు దూరమయ్యాడు. మరీ ముఖ్యమంగా సుజిత్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను కొన్ని నెలలుగా వాయిదా వేస్తున్నాడు. బాహుబలి తర్వాతైనా ఆ సినిమా సెట్స్ పైకి వస్తుందనుకుంటే అది కూడా జరగలేదు. దీంతో సుజిత్-ప్రభాస్ కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయిందనే ప్రచారం సాగింది. ఈ పుకార్లకు స్వయంగా ప్రభాస్ ఫుల్ స్టాప్ పెట్టాడు. అంతేకాదు.. సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ బయటపెట్టాడు. రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ తో కలిసి కచ్చితంగా సినిమా చేస్తానంటున్న ప్రభాస్.. ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తానని ఎనౌన్స్ చేశాడు. అంతేకాదు.. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ను తీసుకున్నట్టు తెలిపాడు. నీల్ నితిన్ తో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. సో.. బాహుబలి-2 కంప్లీట్ అయిన వెంటనే సుజిత్ సినిమా ఉంటుందన్నమాట. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తాడు. హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు.

Next Story