Telugu Global
Cinema & Entertainment

కంగ‌న ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌ల్ని కొట్టింది..!  

టాలెంట్ వుంటే ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర బ్రేక్ వ‌స్తుంది.  ఎప్పుడో ఒక‌సారి విశ్వ‌రూపం బ‌య‌ట ప‌డుతుంది.  అలా   హ‌ర్యాన బ్యూటీ  కంగ‌న తన టాలెంట్ నీ ‘క్వీన్’ చిత్రంలో చూపింది.  ఫ్యాష‌న్ చిత్రంలో  డ్ర‌గ్స్ తీసుకుని   లైఫ్ స్పాయిల్ చేసుకున్న టాప్ మోడ‌ల్  రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ గీతాంజ‌లి  నాగ్ పాల్  క్యారెక్ట‌ర్ ను  అద్భుతంగా పోషించింది. ఆ  త‌రువాత   `త‌ను వెడ్స్ మ‌ను` చిత్రంలోనూ  మెప్పించింది. అయితే  న‌టిగా చెల‌రేగాడానికి స్కోప్ […]

కంగ‌న ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌ల్ని కొట్టింది..!  
X
టాలెంట్ వుంటే ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర బ్రేక్ వ‌స్తుంది. ఎప్పుడో ఒక‌సారి విశ్వ‌రూపం బ‌య‌ట ప‌డుతుంది. అలా హ‌ర్యాన బ్యూటీ కంగ‌న తన టాలెంట్ నీ ‘క్వీన్’ చిత్రంలో చూపింది. ఫ్యాష‌న్ చిత్రంలో డ్ర‌గ్స్ తీసుకుని లైఫ్ స్పాయిల్ చేసుకున్న టాప్ మోడ‌ల్ రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ గీతాంజ‌లి నాగ్ పాల్ క్యారెక్ట‌ర్ ను అద్భుతంగా పోషించింది. ఆ త‌రువాత 'త‌ను వెడ్స్ మ‌ను' చిత్రంలోనూ మెప్పించింది. అయితే న‌టిగా చెల‌రేగాడానికి స్కోప్ మాత్రం 'క్వీన్' చిత్రంలోనే ద‌క్కింద‌ని చెప్పాలి.
ఈ చిత్రంలో కంగ‌న న‌ట‌న‌కు నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌రెస్ అవార్డు సొంతం అయ్యింది. దీంతో పాటు త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్ చిత్రం లో కంగ‌న న‌ట‌న‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లొచ్చాయి. ఇక తాజాగా రంగూన్ అనే చిత్రంలో నటీస్తుంది. స్వాతంత్రోద్యొమ కాలంలో జ‌రిగిన ఒక ప్రేమ క‌థ‌ను రంగూన్ చిత్రంలో చూపిస్తున్నార‌ట. కథా ప‌రంగా కంగ‌న గుర్ర‌పు స్వారీలు.. చేయాల్సి వ‌చ్చి ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. అయితే 'రంగూన్' చిత్రం కోసం తీసుకున్న హ‌ర్స్ రైడింగ్.. క‌త్తి ఫైటింగ్స్ .. త‌న న‌టించ బోయో త‌దుప‌రి చిత్రం 'ఝాన్సి ల‌క్ష్మీబాయ్' చిత్రానికి కూడా ఉప‌యోగ ప‌డుతాయంటో్ంది. అందుకే ఈ హాట్ బ్యూటీ స‌ర‌ద‌గా ఒక్క షాట్ కు టు బ‌ర్డ్స్ అనే ప‌దాన్ని ఉపయోగిస్తుంద‌ట‌. తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న 'ఏక్ నిరంజ‌న్'తో టాలీవుడ్ ఆడియ‌న్స్ కు డైరెక్ట్ గా ప‌రిచ‌య‌మైన విషయం తెలిసిందే మ‌రి.
First Published:  14 Aug 2015 7:10 PM GMT
Next Story