Telugu Global
Others

మూడో బెయిల‌వుట్ ప్రణాళిక‌కు గ్రీస్ గ్రీన్ సిగ్న‌ల్ 

గ్రీస్ పార్ల‌మెంటులో మూడో బెయిల‌వుట్ ప్ర‌ణాళిక ఆమోదం పొందింది. 300 మంది స‌భ్యులున్న గ్రీస్ పార్ల‌మెంటులో ఉద్దీప‌న‌కు అనుకూలంగా 222 మంది ఎంపీలు ఓటేసారు. వ్యతిరేకంగా 64 మంది ఓటేసారు. వ్య‌తిరేకంగా ఓటేసిన 64 మందిలో 40 మంది సొంత పార్టీ సిరిజాకు చెందిన వారు ఉండ‌డంతో ప్ర‌ధాని సిప్రాస్ ఖంగుతిన్నారు. ఈ బెయిల‌వుట్‌ను ఈయు ఆర్థిక మంత్రులు ఆమోదిస్తే  తాత్కాలిక ఆర్థిక సంక్షోభం నుంచి గ్రీస్ బ్రైట ప‌డుతుంది. 85 బిలియ‌న్ల  (రూ. 5.50 ల‌క్ష‌ల […]

మూడో బెయిల‌వుట్ ప్రణాళిక‌కు గ్రీస్ గ్రీన్ సిగ్న‌ల్ 
X
గ్రీస్ పార్ల‌మెంటులో మూడో బెయిల‌వుట్ ప్ర‌ణాళిక ఆమోదం పొందింది. 300 మంది స‌భ్యులున్న గ్రీస్ పార్ల‌మెంటులో ఉద్దీప‌న‌కు అనుకూలంగా 222 మంది ఎంపీలు ఓటేసారు. వ్యతిరేకంగా 64 మంది ఓటేసారు. వ్య‌తిరేకంగా ఓటేసిన 64 మందిలో 40 మంది సొంత పార్టీ సిరిజాకు చెందిన వారు ఉండ‌డంతో ప్ర‌ధాని సిప్రాస్ ఖంగుతిన్నారు. ఈ బెయిల‌వుట్‌ను ఈయు ఆర్థిక మంత్రులు ఆమోదిస్తే తాత్కాలిక ఆర్థిక సంక్షోభం నుంచి గ్రీస్ బ్రైట ప‌డుతుంది. 85 బిలియ‌న్ల (రూ. 5.50 ల‌క్ష‌ల కోట్లు) అప్పు ల‌భిస్తుంది. అయితే, జ‌ర్మ‌నీ ఆర్థిక మంత్రి మాత్రం గ్రీస్‌పై మ‌రిన్ని ఆంక్ష‌ల‌కు ఒత్తిడి చేస్తుండ‌డంపై గ్రీస్ ప్ర‌ధాని మండిప‌డ్డారు. ఈయూ నుంచి గ్రీస్‌ను త‌ప్పించాల‌ని జ‌ర్మ‌నీ ఆర్థిక‌మంత్రి చూస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.
First Published:  14 Aug 2015 1:13 PM GMT
Next Story