Telugu Global
Others

కేసీఆర్ ఓ పిట్ట‌ల‌దొర: ఎర్ర‌బెల్లి, రావుల  

ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిట్ట‌ల‌దొర‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు, రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిలు విమ‌ర్శించారు. ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ సీఎం త‌న సోడా నీళ్ల‌తో పాటు పేద‌ల‌కు సాగునీరు, తాగునీరు వ‌స‌తి కూడా క‌ల్పించాల‌ని కోరారు. రాష్ట్రంలోని 33 ప్రాజెక్టుల‌పై మామా అల్లుళ్లు దృష్టి పెట్టాల‌ని, వారిద్ద‌రికీ చంద్ర‌బాబును తిట్ట‌డం త‌ప్ప మ‌రో అజెండా లేద‌ని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి ప‌దేప‌దే తెలంగాణ ధ‌నిక రాష్ట్ర‌మ‌ని […]

కేసీఆర్ ఓ పిట్ట‌ల‌దొర: ఎర్ర‌బెల్లి, రావుల  
X
ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిట్ట‌ల‌దొర‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు, రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిలు విమ‌ర్శించారు. ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ సీఎం త‌న సోడా నీళ్ల‌తో పాటు పేద‌ల‌కు సాగునీరు, తాగునీరు వ‌స‌తి కూడా క‌ల్పించాల‌ని కోరారు. రాష్ట్రంలోని 33 ప్రాజెక్టుల‌పై మామా అల్లుళ్లు దృష్టి పెట్టాల‌ని, వారిద్ద‌రికీ చంద్ర‌బాబును తిట్ట‌డం త‌ప్ప మ‌రో అజెండా లేద‌ని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి ప‌దేప‌దే తెలంగాణ ధ‌నిక రాష్ట్ర‌మ‌ని చెబుతున్నారు. అయితే, ఆత్మ‌హ‌త్య‌ల్లో రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉంద‌ని గుర్తు చేశారు. కేసీఆర్ పిట్ట‌ల‌దొర‌లా కాకుండా బాధ్య‌త గ‌ల సీఎంగా వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై త్వ‌ర‌లో ప్ర‌ధాని మోడీని క‌లుస్తామ‌ని ఆయ‌న చెప్పారు.
First Published:  14 Aug 2015 1:13 PM GMT
Next Story