Telugu Global
Cinema & Entertainment

మ‌హేష్ కంటే స‌మంత నే టాప్..!

ప్ర‌స్తుతం  శ్రీ‌మంతుడు  చిత్రం గురించి  ఎంత చెప్పినా త‌క్కువే అన్న‌ట్లుంది  మ‌హేష్ అభిమానుల హ‌డావుడి. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే  విడుద‌లైన అన్ని చోట్ల  ( త‌మిళ్ తో క‌లిపి)   దాదాపు 50 కోట్ల  షేర్ వ‌సూలు చేసింది.   దీంతో  మ‌హేష్ బాబు 50 కోట్ల మార్క్ చేసిన చిత్రాల సంఖ్య మూడు కు చేరింది.  ఈ విష‌యాన్ని  ప్రిన్స్ ఫ్యాన్స్..  ఒక రేంజ్ లో   ప్ర‌చారం చేసుకుంటు.. త‌మ హీరో   […]

మ‌హేష్ కంటే స‌మంత నే టాప్..!
X
ప్ర‌స్తుతం శ్రీ‌మంతుడు చిత్రం గురించి ఎంత చెప్పినా త‌క్కువే అన్న‌ట్లుంది మ‌హేష్ అభిమానుల హ‌డావుడి. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే విడుద‌లైన అన్ని చోట్ల ( త‌మిళ్ తో క‌లిపి) దాదాపు 50 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. దీంతో మ‌హేష్ బాబు 50 కోట్ల మార్క్ చేసిన చిత్రాల సంఖ్య మూడు కు చేరింది. ఈ విష‌యాన్ని ప్రిన్స్ ఫ్యాన్స్.. ఒక రేంజ్ లో ప్ర‌చారం చేసుకుంటు.. త‌మ హీరో అల్టిమేట్ అన్న‌ట్లు ప్రొజ‌క్ష‌న్ మొద‌లెట్టారు. దీంతో స‌మంత ఫ్యాన్స్ కు మండిన‌ట్లుంది.
అంతే వారు ప్రిన్స్ మ‌హేష్ బాబు కంటే.. స‌మంత నే టాప్ అంటూ రివ‌ర్స్ గేర్ మొద‌లెట్టారు. 50 కోట్ల మార్క్ దాటిన చిత్రాలు మ‌హేష్ వి , దూకుడు, సీత‌మ్మ వాకిట్లో సిర‌మ‌ల్లె చెట్టు ,తాజాగా శ్రీ‌మంతుడు .. ముచ్చ‌ట‌గా మూడు చిత్రాలు మాత్ర‌మే. అయితే స‌మంత ఈ విష‌యంలో మ‌హేష్ బాబు కంటే ఒక నెంబ‌ర్ ఎక్కువే అని వారంటున్నారు.
స‌మంత ప్రిన్స్ స‌ర‌స‌న చేసిన దూకుడు, స‌తీమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రాల‌తోపాటు..ప‌వ‌న్ స‌ర‌సన చేసిన‌ అత్తారింటికి దారేది.. బ‌న్నీ స‌ర‌స‌న చేసిన స‌న్నాఫ్ కృష్ణ మూర్తి చిత్రాలు కూడా ఉన్నాయి.. నిజ‌మే క‌దా.. ! మ‌రి ఈ విష‌యాన్ని మ‌హేష్ అభిమానులు ఎలా డైజెస్ట్ చేసుకుంటారో చూడాలిమరి.. ఎందుకంటే.. హీరోకంటే.. హీరోయిన్ రికార్డ్ విష‌యంలో బెట‌ర్ గా ఉంట‌డం అంటే కాస్తా ఇబ్బందే క‌దా.! కొన్ని సార్లు నిజాలు చేదుగా వుంటాయి. ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ చేసుకోక త‌ప్ప‌దు మ‌రి.
Next Story