Telugu Global
Others

హంత‌క ముఠా రిమాండ్ ఖైదీల ప‌రారీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌తో స‌హా ప‌లు రాష్ట్రాల్లో 31 హ‌త్య‌ల‌తో పాటు ప‌లు నేరాల్లో నేర‌స్తుల‌యిన న‌లుగురు రిమాండ్ ఖైదీలు గురువారం సంగారెడ్డి కోర్టు వ‌ద్ద ప‌రారయ్యారు. వారిలో ఒక‌ర్ని పోలీసులు ప‌ట్టుకోగా, మిగిలిన ముగ్గురు త‌ప్పించుకున్నారు. మ‌హారాష్ట్ర‌లోని  బీడ జిల్లా పార్టీ వైద్య‌నాథ్‌కు చెందిన త‌రుణ్‌ బోస్టే, ల‌క్ష్మ‌న్ బోస్లే, ప‌ర‌మేశ్వ‌ర్‌, కైలాష్ లు క‌రుడుగట్టిన నేర‌స్థులు. ప‌సిపిల్ల‌లు, వృద్ధుల‌తో పాటు 31 మందిని హ‌త్య చేసారు. ఒక్క  తెలంగాణ‌లోనే రెండేళ్ల‌లో  ఆరుహ‌త్య‌లు చేశారు. హ‌త్య‌కు గురైన […]

హంత‌క ముఠా రిమాండ్ ఖైదీల ప‌రారీ
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌తో స‌హా ప‌లు రాష్ట్రాల్లో 31 హ‌త్య‌ల‌తో పాటు ప‌లు నేరాల్లో నేర‌స్తుల‌యిన న‌లుగురు రిమాండ్ ఖైదీలు గురువారం సంగారెడ్డి కోర్టు వ‌ద్ద ప‌రారయ్యారు. వారిలో ఒక‌ర్ని పోలీసులు ప‌ట్టుకోగా, మిగిలిన ముగ్గురు త‌ప్పించుకున్నారు. మ‌హారాష్ట్ర‌లోని బీడ జిల్లా పార్టీ వైద్య‌నాథ్‌కు చెందిన త‌రుణ్‌ బోస్టే, ల‌క్ష్మ‌న్ బోస్లే, ప‌ర‌మేశ్వ‌ర్‌, కైలాష్ లు క‌రుడుగట్టిన నేర‌స్థులు. ప‌సిపిల్ల‌లు, వృద్ధుల‌తో పాటు 31 మందిని హ‌త్య చేసారు. ఒక్క తెలంగాణ‌లోనే రెండేళ్ల‌లో ఆరుహ‌త్య‌లు చేశారు. హ‌త్య‌కు గురైన వారిలో ప‌సిపాప కూడా ఉంది. పోలీసులు వారి కోసం దాదాపు 40 రోజుల పాటు ప‌ర్లీలో మ‌కాం వేసి ప‌ట్టుకున్నారు. గురువారం కోర్టులో హాజ‌రు ప‌రిచేందుకు మెద‌క్ జిల్లా కేంద్రం సంగారెడ్డి వ‌ద్ద‌కు తీసుకు వ‌చ్చారు. వారితో పాటు మ‌రో ఇద్ద‌రు సాధార‌ణ ఖైదీల‌ను కూడా పోలీసులు తీసుకు వ‌చ్చారు. ముందు వారిని హాజ‌రు ప‌రిచిన పోలీసులు వీరిని హాజ‌రు ప‌రిచే స‌మ‌యంలో నిందితుల్లో ఒక‌డైన ప‌ర‌మేశ్ గ‌ట్టిగా అరుస్తూ ప‌రిగెత్తాడు. పోలీసులు అత‌డిని ప‌ట్టుకోవ‌డానికి వెళ్లిన స‌మ‌యంలో మిగిలిన ముగ్గురు పారిపోయారు. పోలీసులు ప‌ర‌మేశ్‌ను స్థానిక సితారా ధియేట‌ర్ వ‌ద్ద ప‌ట్టుకున్నారు.
First Published:  13 Aug 2015 1:05 PM GMT
Next Story