Telugu Global
Others

గంగా య‌మున యాత్ర‌కు ఐఆర్‌సీటీసీ శ్రీ‌కారం

ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక రైళ్ల‌ను ప్రారంభించ‌నుంది. అక్టోబ‌రు 10వ తేదీన  ప‌విత్ర గంగా య‌మున యాత్ర పేరుతో ఒక రైలు హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరనుందని ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఎన్‌.సంజీవ‌య్య గురువారం వెల్ల‌డించారు. ఈ రైళ్లు అక్టోబ‌రు నుంచి ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌టి న‌డుస్తాయ‌ని చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నైల నుంచి ఈ రైళ్లు ఇప్ప‌టికే న‌డుస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కాశీ విశ్వనాధ ఆల‌యం, విశాలాక్షి, అన్న‌పూర్ణ‌, త్రివేణి సంగ‌మ స్నానం, గంగాస్నానం, […]

గంగా య‌మున యాత్ర‌కు ఐఆర్‌సీటీసీ శ్రీ‌కారం
X
ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక రైళ్ల‌ను ప్రారంభించ‌నుంది. అక్టోబ‌రు 10వ తేదీన ప‌విత్ర గంగా య‌మున యాత్ర పేరుతో ఒక రైలు హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరనుందని ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఎన్‌.సంజీవ‌య్య గురువారం వెల్ల‌డించారు. ఈ రైళ్లు అక్టోబ‌రు నుంచి ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌టి న‌డుస్తాయ‌ని చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నైల నుంచి ఈ రైళ్లు ఇప్ప‌టికే న‌డుస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కాశీ విశ్వనాధ ఆల‌యం, విశాలాక్షి, అన్న‌పూర్ణ‌, త్రివేణి సంగ‌మ స్నానం, గంగాస్నానం, హ‌రిద్వార్‌లో మాన‌సాదేవి మందిరం, ఢిల్లీలోని ద‌ర్శ‌నీయ స్థలాల‌తో పాటు మ‌ధుర శ్రీృష్ణ జ‌న్మ‌భూమి త‌దిత‌ర ద‌ర్శనీయ‌స్థ‌లాలున్నాయి. ప‌ది రోజుల పాటు ప‌ర్య‌ట‌న సాగుతుంది. 7 కోచ్‌ల‌తో ఉన్న ఈ ఆధ్యాత్మిక రైల్లో 560 మంది ప్ర‌యాణీకులకు అవ‌కాశం ఉంటుంది. స్లీప‌ర్‌లో ఒక్కొక్క‌రికి రూ. 9,100, థ‌ర్డ్ ఏసీలో రూ. 19,700లు, సెకండ్ ఏసీలో రూ. 26,500ల చొప్పున ప్యాకేజీలున్నాయి. బెర్తులు బుక్ చేసుకోద‌లిచిన వారు 040-27702407, 9701360648, 9701360615 ఫోన్ నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించాలి.
First Published:  13 Aug 2015 1:13 PM GMT
Next Story