Telugu Global
NEWS

చార్జీలు పెంచితే చంద్ర‌బాబుకు షాకులే!

సీపీఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై విద్యుత్ భారాలు మోపాల‌ని చూస్తున్నార‌ని, అదే జ‌రిగితే గ‌తంలో ఇచ్చిన‌ట్లుగానే ఆయ‌న‌కు క‌రెంట్ షాకులు త‌ప్ప‌వ‌ని సీపీఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ హెచ్చ‌రించారు.  ట్రూ ఆప్‌ ఛార్జీల చెల్లింపుల పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి రూ. 7,209కోట్ల భారాన్ని మోప‌బోతున్నదని రామ‌కృష్ణ‌ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్ళ కిందట పాత బకాయిలు అన్నీంటిని ఒకేసారి విధించేందుకు, […]

చార్జీలు పెంచితే చంద్ర‌బాబుకు షాకులే!
X
సీపీఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై విద్యుత్ భారాలు మోపాల‌ని చూస్తున్నార‌ని, అదే జ‌రిగితే గ‌తంలో ఇచ్చిన‌ట్లుగానే ఆయ‌న‌కు క‌రెంట్ షాకులు త‌ప్ప‌వ‌ని సీపీఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ హెచ్చ‌రించారు. ట్రూ ఆప్‌ ఛార్జీల చెల్లింపుల పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి రూ. 7,209కోట్ల భారాన్ని మోప‌బోతున్నదని రామ‌కృష్ణ‌ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్ళ కిందట పాత బకాయిలు అన్నీంటిని ఒకేసారి విధించేందుకు, గతంలో వినియోగదారులు చెల్లించాల్సిన ఇంధన సర్దుబాటు చార్జీలను కూడా ఈ మొత్తంలో కలిపారని పేర్కొన్నారు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఇంధన సర్దుబాటు చార్జీలను చెల్లించవద్దంటూ 2011లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా, ఈ మొత్తాన్ని కూడా ట్రూ ఆప్‌ చార్జీలతో కలిపారని తెలిపారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్‌ షాక్‌కు గురైన విషయాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఇపుడు విద్యుత్‌ చార్జీలు పెంచితే గతం పునరావృతమవుతుందని చంద్ర‌బాబు ప్రభుత్వాన్నిరామ‌కృష్ణ‌ హెచ్చరించారు. తక్షణం ఈ ఛార్జీలను ఉపసంహ‌రించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపిలు అటో ఇటో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని రామకృష్ణ పేర్కొన్నారు. ఆగస్టు 11 బంద్‌ తర్వాతనైనా ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి మేల్కోవ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని అన్నారు. ఈ అంశంపై ఈ నెల 15 తర్వాత మోడీని కలుస్తానని చెప్పడం సంతోషించద‌గిందేన‌ని పేర్కొన్నారు.
First Published:  13 Aug 2015 9:58 PM GMT
Next Story