Telugu Global
Others

వికలాంగ వ్యాపారిపై గూండాయిజం

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో గూండాగిరిని ప్రశ్నించినందుకు ఓ మొబైల్ షాపు యజమానిపై దుండగుడు కత్తితో దాడి చేశారు. అయితే అదే షాపులో ఉన్న ఓ కొనుగోలుదారుడు వెంటనే స్పందించి దుండగుడిని అడ్డుకున్నాడు. దాడికి అడ్డు తగులుతూ ఆ దుండగుడిని ధైర్యంగా షాపు నుండి బయటకు లాక్కుపోయాడు. వికలాంగుడైన ఆ షాపు యజమాని రజనీష్ సింగ్ ఠాకూర్‌కు గూండా దాడిలో గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాడి నుంచి ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తిని అందరూ మెచ్చుకున్నారు. పోలీసులు […]

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో గూండాగిరిని ప్రశ్నించినందుకు ఓ మొబైల్ షాపు యజమానిపై దుండగుడు కత్తితో దాడి చేశారు. అయితే అదే షాపులో ఉన్న ఓ కొనుగోలుదారుడు వెంటనే స్పందించి దుండగుడిని అడ్డుకున్నాడు. దాడికి అడ్డు తగులుతూ ఆ దుండగుడిని ధైర్యంగా షాపు నుండి బయటకు లాక్కుపోయాడు. వికలాంగుడైన ఆ షాపు యజమాని రజనీష్ సింగ్ ఠాకూర్‌కు గూండా దాడిలో గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాడి నుంచి ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తిని అందరూ మెచ్చుకున్నారు. పోలీసులు సీసీ కెమెరా ఆధారిత ఫుటేజీతో నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
First Published:  12 Aug 2015 1:19 PM GMT
Next Story