Telugu Global
Others

మ్యాగీపై నిషేధాన్ని ఎత్తేసిన ముంబై హైకోర్టు

మ్యాగీకి ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ముంబై హైకోర్టు గురువారం ఎత్తివేసింది. మ్యాగీ నూడిల్స్‌ నమూనాలను మరోసారి పరీక్షించాలని కోర్టు ఆదేశించింది. మ్యాగీ నూడిల్స్‌లో హానికర పదార్థాలున్నాయంటూ దేశంలోని పలు రాష్ట్రాల్లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాగీపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో నెస్లే ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. ఉత్పత్తులను మరోసారి పరీక్షించాలని ఆదేశిస్తూ అప్పటివరకు నిషేధాన్ని ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. పరీక్షల […]

మ్యాగీకి ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ముంబై హైకోర్టు గురువారం ఎత్తివేసింది. మ్యాగీ నూడిల్స్‌ నమూనాలను మరోసారి పరీక్షించాలని కోర్టు ఆదేశించింది. మ్యాగీ నూడిల్స్‌లో హానికర పదార్థాలున్నాయంటూ దేశంలోని పలు రాష్ట్రాల్లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాగీపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో నెస్లే ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. ఉత్పత్తులను మరోసారి పరీక్షించాలని ఆదేశిస్తూ అప్పటివరకు నిషేధాన్ని ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. పరీక్షల నివేదికలను ఆరు వారాల్లోపు సమర్పించాలని ఆదేశించింది.
First Published:  12 Aug 2015 1:20 PM GMT
Next Story