Telugu Global
Others

దోమ కాటుతో విజృంభిస్తున్న డెంగీ

వాతావ‌ర‌ణంలో మార్పులు చోటు చేసుకోవ‌డం, వ‌ర్షాలు కురిసి మురికి కాల్వ‌ల్లో నీరు నిల‌వ‌డం, అప‌రిశుభ్ర‌త  వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల దోమ‌లు విజృంభిస్తున్నాయి. ప్ర‌జల ర‌క్తాన్ని పీల్చిపిప్పి చేసి వారి ఆరోగ్యంపై దోమ‌కాటుతో  డెంగీ పంజా విసురుతున్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా  ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలు, గిరిజ‌న‌గూడాల్లోని ప్ర‌జ‌లు డెంగీ బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో సుమారు 5 వేల మందికి పైగా ప్ర‌జ‌లు డెంగీ బారిన ప‌డ్డార‌ని వైద్యారోగ్య శాఖ కు చెందిన అధికారి వెల్ల‌డించారు. ఈ వ్యాధితో 5 […]

దోమ కాటుతో విజృంభిస్తున్న డెంగీ
X
వాతావ‌ర‌ణంలో మార్పులు చోటు చేసుకోవ‌డం, వ‌ర్షాలు కురిసి మురికి కాల్వ‌ల్లో నీరు నిల‌వ‌డం, అప‌రిశుభ్ర‌త వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల దోమ‌లు విజృంభిస్తున్నాయి. ప్ర‌జల ర‌క్తాన్ని పీల్చిపిప్పి చేసి వారి ఆరోగ్యంపై దోమ‌కాటుతో డెంగీ పంజా విసురుతున్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలు, గిరిజ‌న‌గూడాల్లోని ప్ర‌జ‌లు డెంగీ బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో సుమారు 5 వేల మందికి పైగా ప్ర‌జ‌లు డెంగీ బారిన ప‌డ్డార‌ని వైద్యారోగ్య శాఖ కు చెందిన అధికారి వెల్ల‌డించారు. ఈ వ్యాధితో 5 మంది ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించార‌ని ఖ‌మ్మం జిల్లాలోనే ఇద్ద‌రు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. ఖ‌మ్మం, ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ‌, హైద‌రాబాద్ జిల్లాల్లో ఈ వ్యాధి తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తోంది. ఈ వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం ఎలాంటి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోక పోవ‌డంతో ప్రైవేట్ వైద్య‌శాల‌లు రోగుల‌ను దోచుకుంటున్నాయి. డెంగీ చికిత్స కోసం వ‌చ్చిన వారికి అవ‌స‌రం లేక పోయినా ప్లేట్‌లెట్స్ ఎక్కించాల‌ని భ‌య‌భ్రాంతులు చేస్తున్నాయి. ఒక్కో ప్లేట్‌లెట్ ప్యాకెట్ ఖ‌రీదు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వ‌ర‌కు ఉంది. రోగుల‌ను వారం నుంచి ప‌ది రోజులు ఆస్ప‌త్రుల్లో ఉంచుకుని రోజుకో ప్లేట్‌లెట్ ప్యాకెట్ ఎక్కిస్తుండ‌డంతో వైద్య‌ఖ‌ర్చు త‌డిచి మోపెడ‌వుతోంది. దీంతో సామాన్యులు ల‌బోదిబో మంటున్నారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిచి వైద్యారోగ్య‌శాఖ‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని, ప్ర‌తి పీహెచ్ సెంట‌ర్లోనూ అవ‌స‌ర‌మైన మందులు అందుబాటులో ఉంచాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.
First Published:  13 Aug 2015 2:40 AM GMT
Next Story