Telugu Global
Cinema & Entertainment

ఈమధ్య కాలంలో ఇదే ఫ్రెష్ టీజర్

ప్రతి సినిమాకు టీజర్ వస్తుంటుంది. సినిమా ప్రమోషన్ షురూ చేసేముందు ఓ 15-20 సెకెన్ల టీజర్ న రిలీజ్ చేయడం ఆనవాయితీ. కానీ ఏ టీజర్ చూసినా ఏమున్నది గర్వకారణం అనే విధంగానే ఉంటున్నాయి అన్నీ. అయితే తాజాగా విడుదలైన నాని కొత్త సినిమా టీజర్ విషయంలో ఎవరికీ ఈ రొటీన్ అభిప్రాయం కలగలేదు. నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా టీజర్ నిజంగానే అదిరిపోయింది. చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగించింది. మ్యూజిక్, విజువల్స్ కలిసి […]

ఈమధ్య కాలంలో ఇదే ఫ్రెష్ టీజర్
X
ప్రతి సినిమాకు టీజర్ వస్తుంటుంది. సినిమా ప్రమోషన్ షురూ చేసేముందు ఓ 15-20 సెకెన్ల టీజర్ న రిలీజ్ చేయడం ఆనవాయితీ. కానీ ఏ టీజర్ చూసినా ఏమున్నది గర్వకారణం అనే విధంగానే ఉంటున్నాయి అన్నీ. అయితే తాజాగా విడుదలైన నాని కొత్త సినిమా టీజర్ విషయంలో ఎవరికీ ఈ రొటీన్ అభిప్రాయం కలగలేదు. నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా టీజర్ నిజంగానే అదిరిపోయింది. చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగించింది. మ్యూజిక్, విజువల్స్ కలిసి ఓ వింత గిలిగింతను రగిల్చాయి. ఇదే మేజిక్ ను సినిమాలో కూడా చూపించగలిగితే అలా మొదలైంది తర్వాత అంతటి హిట్ సొంతం చేసుకున్నవాడవుతాడు నాని. ఈ టీజర్ కు ఇప్పటికే నెట్ లో లక్షల సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. అంతా లైక్స్ మీద లైక్స్ కొడుతున్నారు. మరోవైపు ఈ సినిమా ఆడియోను పంద్రాగస్టు కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకంటున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. మూవీని వచ్చేనెలలో విడుదల చేస్తారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. గీతాఆర్ట్స్, యూవీ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

First Published:  12 Aug 2015 7:05 PM GMT
Next Story