Telugu Global
Others

జిమ్మిబాబు దొరుకుతాడా?

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రాష్ట్ర తెలుగు యువ‌త నాయ‌కుడు జిమ్మీబాబు అరెస్టుకు రంగం సిద్ధ‌మైంది. ఆయ‌న‌కు ఈ కేసులో ఏసీబీ ప‌లుమార్లు నోటీసులు జారీచేసినా పోలీసుల ఎదుట హాజ‌రుకాకుండా త‌ప్పించుకున్న తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త నెల 4న స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌తో పాటు నోటీసులు అందుకున్నా జిమ్మీబాబు విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు. అయితే. సాంకేతిక కార‌ణాల దృష్ట్యా ఈ కేసు కొంత‌కాలంగా స్త‌బ్దుగా ఉంది. సాంకేతిక అడ్డంకులు తొల‌గిపోవ‌డంతో కేసు విచార‌ణ […]

జిమ్మిబాబు దొరుకుతాడా?
X
ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రాష్ట్ర తెలుగు యువ‌త నాయ‌కుడు జిమ్మీబాబు అరెస్టుకు రంగం సిద్ధ‌మైంది. ఆయ‌న‌కు ఈ కేసులో ఏసీబీ ప‌లుమార్లు నోటీసులు జారీచేసినా పోలీసుల ఎదుట హాజ‌రుకాకుండా త‌ప్పించుకున్న తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త నెల 4న స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌తో పాటు నోటీసులు అందుకున్నా జిమ్మీబాబు విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు. అయితే. సాంకేతిక కార‌ణాల దృష్ట్యా ఈ కేసు కొంత‌కాలంగా స్త‌బ్దుగా ఉంది. సాంకేతిక అడ్డంకులు తొల‌గిపోవ‌డంతో కేసు విచార‌ణ వేగ‌వంతం అయ్యేం అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే జిమ్మీబాబు గాలింపు కోసం ఏసీబీ ప్ర‌త్యేక బృందాన్ని రంగంలోకి దించింది. ఏపీలోని త‌న బంధువుల ఇళ్ల‌ల్లో జిమ్మీబాబు త‌ల‌దాచుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఇంత‌కాలం ప‌రారీలో ఉండ‌టంతో ఆయ‌న దొరికితే నేరుగా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
నిందితుల‌కు ఏపీ అడ్డా..!
ఈ కేసులో నిందితులంతా ఏపీని అడ్డాగా చేసుకుని తెలంగాణ పోలీసుల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మ‌త్త‌య్య ఏపీకి వెళ్లి అక్క‌డ నుంచి కోర్టు ద్వారా అరెస్టును నిలుపుద‌ల చేయించుకున్నాడు. ఇక ఎమ్మెల్యే సండ్ర సైతం ఏపీలో కొంత‌కాలం అజ్ఞాతంలో ఉండి రేవంత్‌రెడ్డికి బెయిల్ రాగానే తెలంగాణ‌కు వ‌చ్చాడు. తాజాగా తెర‌పైకి వ‌చ్చిన జిమ్మీబాబు కూడా ఏపీలోనే త‌ల‌దాచుకుని తెలంగాణ పోలీసుల‌కు స‌వాలు విసురుతున్నాడు. త‌న పేరు బ‌య‌టికి వ‌చ్చిన కొత్త‌లో మ‌త్త‌య్య‌లా వ్యవ‌హ‌రించి అరెస్టు నుంచి త‌ప్పించుకుందామ‌నుకున్నా సాంకేతికంగా కుద‌ర‌లేదు. అందుకే ఏపీలో త‌ల‌దాచుకుంటున్నాడు. ఏదేమైనా ఈ కేసులో నిందితులంతా టీడీపీ ప్ర‌భుత్వానికి కావాల్సినంత బుర‌ద అంటిస్తున్న మాట వాస్త‌వ‌మే. ఆ మాట‌కొస్తే ఈ కేసు టీడీపీ అధినేత మెడ‌కు చుట్టుకుంటుంద‌న్న భ‌యంతో ఈ పార్టీ నేత‌లే నిందితుల‌ను దాస్తున్నారంటూ టీఆర్ ఎస్, వైఎస్సార్ సీపీ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. జిమ్మీబాబు పోలీసుల‌కు చిక్కుతాడా? లొంగిపోతాడా? మ‌త్త‌య్య బాట‌లోవెళ్తాడా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌కంగా మారింది.
First Published:  11 Aug 2015 10:22 PM GMT
Next Story