Telugu Global
Cinema & Entertainment

ఆ సీన్ మొన్న తీసేసారు..! ఇప్పుడెందుకు కలిపారు..?

శ్రీమంతుడు సినిమా ఇప్పటికే సూపర్ హిట్టయింది. వసూళ్లలో అత్తారింటికి దారేది మూవీని దాటేయడానికి శరవేగంగా దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో రాబోయే వీకెండ్ మరిన్ని వసూళ్లు రాబట్టేందుకు సినిమా యూనిట్ మరో ఖతర్నాక్ స్కెచ్ రెడీ చేసింది. శ్రీమంతుడు సినిమాకు అదనంగా మరికొన్ని సీన్లు జతచేయాలని నిర్ణయించింది. ఈ సీన్లతో శ్రీమంతుడు సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ పెరుగుతారని భావిస్తున్నారు. అరాచకాలు భరించలేక రాజేంద్రప్రసాద్ తన కుటుంబంతో కలిసి గ్రామాన్ని వీడి వెళ్లిపోవాలనుకుంటాడు. ఆ కుటుంబాన్ని మహేష్ బాబు […]

ఆ సీన్ మొన్న తీసేసారు..! ఇప్పుడెందుకు కలిపారు..?
X
శ్రీమంతుడు సినిమా ఇప్పటికే సూపర్ హిట్టయింది. వసూళ్లలో అత్తారింటికి దారేది మూవీని దాటేయడానికి శరవేగంగా దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో రాబోయే వీకెండ్ మరిన్ని వసూళ్లు రాబట్టేందుకు సినిమా యూనిట్ మరో ఖతర్నాక్ స్కెచ్ రెడీ చేసింది. శ్రీమంతుడు సినిమాకు అదనంగా మరికొన్ని సీన్లు జతచేయాలని నిర్ణయించింది. ఈ సీన్లతో శ్రీమంతుడు సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ పెరుగుతారని భావిస్తున్నారు. అరాచకాలు భరించలేక రాజేంద్రప్రసాద్ తన కుటుంబంతో కలిసి గ్రామాన్ని వీడి వెళ్లిపోవాలనుకుంటాడు. ఆ కుటుంబాన్ని మహేష్ బాబు ఆపుతాడు. ట్రయిలర్స్ లో ఈ సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. కానీ సినిమాలో మాత్రం లేవు. నిడివి ఎక్కువవ్వడంతో తొలిగించిన ఆ సీన్లను ఇప్పుడు మళ్లీ జతచేస్తున్నారు. గతంలో కొరటాల శివ డైరక్ట్ చేసిన మిర్చి సినిమాలో కూడా ఇలానే జరిగింది. భారీ ఖర్చుతో తీసిన రెయిన్ ఫైట్ ను నిడివి ఎక్కువైందనే కారణంతో తీసేశారు. తర్వాత సినిమాకు హిట్ టాక్ రావడంతో వర్షంతో తీసిన ఫైట్ సీన్ ను జతచేశారు. ఇప్పుడు శ్రీమంతుడు సినిమా కోసం కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు దర్శకుడు కొరటాల శివ.
First Published:  11 Aug 2015 7:01 PM GMT
Next Story