Telugu Global
Cinema & Entertainment

తిరుగులేని రికార్డు దిశగా బాహుబలి

ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా పీకే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి దాదాపు 7వందల కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే. ఈ మూవీ తర్వాత అమీర్ ఖానే నటించిన ధూమ్-3 సినిమా రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ సినిమా వసూళ్లను త్వరలోనే సల్మాన్ ఖాన్ బజరంగీ భాయ్ జాన్ మూవీ క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ధూమ్-3కి దాదాపు 550 కోట్ల రూపాయలు వచ్చాయి. […]

తిరుగులేని రికార్డు దిశగా బాహుబలి
X
ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా పీకే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి దాదాపు 7వందల కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే. ఈ మూవీ తర్వాత అమీర్ ఖానే నటించిన ధూమ్-3 సినిమా రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ సినిమా వసూళ్లను త్వరలోనే సల్మాన్ ఖాన్ బజరంగీ భాయ్ జాన్ మూవీ క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ధూమ్-3కి దాదాపు 550 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ మొత్తాన్ని ఈవీకెండ్ నాటికి బజరంగీ భాయ్ జాన్ సంపాదిస్తుంది. అలా ఆల్ టైమ్ టాప్-10 మూవీస్ లో రెండో స్థానానికి వెళ్తుంది సల్మాన్ మూవీ. అయితే మూడో స్థానం మాత్రం బాహుబలిదే అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఇప్పటివరకు ఈ సినిమాకు రానన్ని వసూళ్లు బాహుబలికి వస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా 500 కోట్ల రూపాయలతో స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా చాలా థియేటర్లలో ఆడుతోంది కూడా. ఇప్పటివరకు హృతిక్, షారూక్ లాంటి స్టార్స్ కు కూడా ఇన్ని వసూళ్లు సాధించడం సాధ్యం కాలేదు. రాబోయే రోజుల్లో బాహుబలి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ సినిమాను ట్రిమ్ చేసి హాలీవుడ్ లో కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. త్వరలోనే అమెరికా, లండన్, ఆస్ట్రేలియాలో గంటన్నర నిడివితో, ఇంగ్లిష్ వెర్షన్ లో బాహుబలి విడుదలకానుంది.
First Published:  11 Aug 2015 7:05 PM GMT
Next Story