Telugu Global
Cinema & Entertainment

తాప్సిని చెడామడా తిట్టిన దర్శకుడు

తన సినిమాల విషయంలో చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది తాప్సి. నోటి ముందు మైక్ పెడితే చాలు తన కొత్త సినిమా విశేషాల్ని లొడలొడ మాట్లాడేస్తుంది. ఈమధ్య కూడా ఇలానే ఓ సినిమా గురించి మాట్లాడి చీవాట్లు తింది తాప్సి. ప్రస్తుతం ఆమె తమిళ్ లో శింబు హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగువాళ్లకు కూడా పరిచయమైన సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమా ఓపెనింగ్ నుంచి కథ, క్యారెక్టర్లను సస్పెన్స్ గా ఉంచుతున్నారు. ఏ ఒక్క […]

తాప్సిని చెడామడా తిట్టిన దర్శకుడు
X
తన సినిమాల విషయంలో చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది తాప్సి. నోటి ముందు మైక్ పెడితే చాలు తన కొత్త సినిమా విశేషాల్ని లొడలొడ మాట్లాడేస్తుంది. ఈమధ్య కూడా ఇలానే ఓ సినిమా గురించి మాట్లాడి చీవాట్లు తింది తాప్సి. ప్రస్తుతం ఆమె తమిళ్ లో శింబు హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగువాళ్లకు కూడా పరిచయమైన సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమా ఓపెనింగ్ నుంచి కథ, క్యారెక్టర్లను సస్పెన్స్ గా ఉంచుతున్నారు. ఏ ఒక్క విషయాన్ని బయటకు రానీయడం లేదు. కానీ తాప్సి మాత్రం తన పాత్ర గురించి మీడియా ముందు వాగేసింది. కొత్త సినిమాలో తను రా (రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్ గా కనిపించబోతున్నానంటూ చెప్పేసింది. దీంతో దర్శకుడు సెల్వ రాఘవన్ కు ఒళ్లు మండింది. తాప్సిని పిలిచి చెడామడా తిట్టేశాడు. ఇకపై సినిమాకు సంబంధించిన విషయాలు బయటపెడితే బాగోదని మొహంమీదే వార్నింగ్ ఇచ్చాడు. సహజంగానే సెల్వరాఘవన్ కు కోపమెక్కువ. తాప్సి విషయంలో ఆ కోపం రెండింతలైంది. దీంతో 2 రోజులు షూటింగ్ కు డుమ్మా కొట్టింది తాప్సి. చేసేదేం లేక తిరిగి సెల్వ రాఘవనే సారీ చెప్పి తాప్సిని సెట్స్ కు తీసుకొచ్చాడు.
First Published:  10 Aug 2015 7:00 PM GMT
Next Story