Telugu Global
Cinema & Entertainment

తల్లి కాబోతున్న రాణి ముఖర్జీ!

హిందీలో అద్భుతంగా రాణించిన హీరోయిన్‌ రాణి ముఖర్జీ తల్లి కాబోతుందన్న వార్తలు ఇపుడు బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ముంబయిలోని ప్రముఖ పత్రిక మరదాని కథనం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న రాణి మాతృత్వం పొందేవరకు అక్కడే ఉండొచ్చని వినికిడి. 36 యేళ్ళ వయస్సులో ఆమె ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకుంది. అప్పటికి చోప్రా వయస్సు 43 సంవత్సరాలు. అఫ్‌కోర్స్‌… రాణి ముఖర్జీకి ఇది తొలి పెళ్ళి అయినా చోప్రాకు మాత్రం రెండో […]

తల్లి కాబోతున్న రాణి ముఖర్జీ!
X
హిందీలో అద్భుతంగా రాణించిన హీరోయిన్‌ రాణి ముఖర్జీ తల్లి కాబోతుందన్న వార్తలు ఇపుడు బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ముంబయిలోని ప్రముఖ పత్రిక మరదాని కథనం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న రాణి మాతృత్వం పొందేవరకు అక్కడే ఉండొచ్చని వినికిడి. 36 యేళ్ళ వయస్సులో ఆమె ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకుంది. అప్పటికి చోప్రా వయస్సు 43 సంవత్సరాలు. అఫ్‌కోర్స్‌… రాణి ముఖర్జీకి ఇది తొలి పెళ్ళి అయినా చోప్రాకు మాత్రం రెండో పెళ్ళి. ఆదిత్య చోప్రా అంతకుముందే పాయల్‌ ఖన్నాను పెళ్ళి చేసుకోవడం 2009లో విడాకులు తీసుకోవడం కూడా జరిగిపోయింది.
అయితే రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రా జీవితం 21తో ముడి వేసుకుపోయిందని చెబుతారు. ఎందుకంటే రాణి ముఖర్జీ పుట్టినరోజు 1978 మార్చి 21 కాగా ఆదిత్య చోప్రా జన్మదినం 1971 మే 21. వీరిద్దరి పెళ్ళి కూడా 2014 ఏప్రిల్‌ 21నే జరిగింది. ఇంకో విశేషమేమంటే… ఆదిత్య చోప్రా తన తొలి సినిమా ‘దుల్హన్‌వాలే దుల్హేనియా లే జాయేంగే’ను తన 21వ యేటనే దర్శకత్వం వహించాడట. ఆదిత్య తండ్రి యాష్‌ చోప్రా అంటే రాణి ముఖర్జీ మామగారు చనిపోయింది కూడా 2012 అక్టోబర్‌ 21నే నట. అంటే వీరిద్దరి పెళ్ళిరోజు, పుట్టినరోజు ఒకేటే కదా! అందుచేతే ఈ 21కి వీరిద్దరి జీవితానికి అవినాభావ సంబంధముందని అంటారు. బహుశా రాణి ముఖర్జీ జన్మనిచ్చే పాప కూడా 21వ తేదీనే పుడుతుందేమో చూడాలి.!
First Published:  11 Aug 2015 12:59 AM GMT
Next Story