Telugu Global
Others

పెద్ద‌ల అశ్లీల సైట్ల‌ను నిషేధించ‌లేం 

చిన్నారుల అశ్లీల వెబ్‌సైట్ల‌ను మాత్ర‌మే నిషేధించ‌గ‌లం త‌ప్ప పెద్ద‌వారి సైట్ల‌ను నిషేధించ‌లేమ‌ని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్న‌వించింది. నాలుగు గోడ‌ల మ‌ధ్య ప్ర‌జ‌లు ఏం చూస్తున్నార‌న్న‌ది నిర్థారించ‌లేమ‌ని,  వారు చూస్తున్న దృశ్యాల‌ను నియంత్రించ‌లేమ‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌ద్గీ వాదించారు. అలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను, వినోదాన్ని హ‌రించ‌డ‌మ‌వుతుంద‌ని, దీనికి స‌రైన శిక్ష కూడా విధించ‌లేమ‌ని ఆయ‌న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి హెచ్ఎల్ గుప్తా నేతృత్వంలోని  ధ‌ర్మాస‌నం ముందు వివ‌రించారు. అయితే, చిన్న పిల్ల‌ల అశ్లీల […]

చిన్నారుల అశ్లీల వెబ్‌సైట్ల‌ను మాత్ర‌మే నిషేధించ‌గ‌లం త‌ప్ప పెద్ద‌వారి సైట్ల‌ను నిషేధించ‌లేమ‌ని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్న‌వించింది. నాలుగు గోడ‌ల మ‌ధ్య ప్ర‌జ‌లు ఏం చూస్తున్నార‌న్న‌ది నిర్థారించ‌లేమ‌ని, వారు చూస్తున్న దృశ్యాల‌ను నియంత్రించ‌లేమ‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌ద్గీ వాదించారు. అలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను, వినోదాన్ని హ‌రించ‌డ‌మ‌వుతుంద‌ని, దీనికి స‌రైన శిక్ష కూడా విధించ‌లేమ‌ని ఆయ‌న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి హెచ్ఎల్ గుప్తా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ముందు వివ‌రించారు. అయితే, చిన్న పిల్ల‌ల అశ్లీల సైట్ల‌ను నిషేధించ‌డంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు. అశ్లీల వెబ్ సైట్ల‌ను నిషేధించాల‌ని ఇండోర్‌కు చెందిన న్యాయ‌వాది క‌మ‌లేశ్ వాస్వాని దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీం సోమ‌వారం విచాణరించింది. కేంద్రం జూలై 31న 857 వెబ్‌సైట్ల‌ను నిషేధించాల‌ని స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను ఆదేశించింది. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌డంతో కేంద్రం అశ్లీల సైట్ల నిషేధంపై వెనుకంజ వేసింది.
First Published:  10 Aug 2015 1:11 PM GMT
Next Story