Telugu Global
Cinema & Entertainment

ఫ్లాపు హీరోయిన్ల పుష్పక విమానం

మీరు తెలుగులో ఫ్లాప్ హీరోయిన్ గా ముద్రవేయించుకున్నారా. ఎన్ని సినిమాలు చేసినా ఒక్క మూవీ కూడా హిట్టవ్వడం లేదా. ఎంత అందమున్నా క్రేజ్ మాత్రం రావట్లేదా.. ఇక సినిమాలు ఆపేసి ఇంటికెళ్లిపోదామనుకుంటున్నారా.. మీలాంటి హీరోయిన్ల కోసం ఇప్పుడు ఓ ఇండస్ట్రీ ఆశగా ఎదురుచూస్తోంది. అదే శాండిల్ వుడ్. కన్నడ సినీపరిశ్రమ. అవును.. తెలుగులో ఫ్లాప్ అయిన భామలకు కన్నడ పరిశ్రమ పుష్పక విమానంలా మారింది. ఎంతమంది ఫ్లాప్ భామలొచ్చినా రా..రమ్మంటూ ఆహ్వానిస్తోంది. కొన్నేళ్లుగా శాండిల్ వుడ్ లో […]

ఫ్లాపు హీరోయిన్ల పుష్పక విమానం
X
మీరు తెలుగులో ఫ్లాప్ హీరోయిన్ గా ముద్రవేయించుకున్నారా. ఎన్ని సినిమాలు చేసినా ఒక్క మూవీ కూడా హిట్టవ్వడం లేదా. ఎంత అందమున్నా క్రేజ్ మాత్రం రావట్లేదా.. ఇక సినిమాలు ఆపేసి ఇంటికెళ్లిపోదామనుకుంటున్నారా.. మీలాంటి హీరోయిన్ల కోసం ఇప్పుడు ఓ ఇండస్ట్రీ ఆశగా ఎదురుచూస్తోంది. అదే శాండిల్ వుడ్. కన్నడ సినీపరిశ్రమ. అవును.. తెలుగులో ఫ్లాప్ అయిన భామలకు కన్నడ పరిశ్రమ పుష్పక విమానంలా మారింది. ఎంతమంది ఫ్లాప్ భామలొచ్చినా రా..రమ్మంటూ ఆహ్వానిస్తోంది. కొన్నేళ్లుగా శాండిల్ వుడ్ లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నికేషా పటేల్, సలోనీ, పూనమ్ బజ్వా, రక్ష, విమలారామన్, భావన, షర్మిలా మాండ్రే, విశాఖ సింగ్, పూర్ణిమ.. ఇలా ఒకరుకాదు.. తెలుగులో ఫ్లాప్ హీరోయిన్లుగా పేరుతెచ్చుకున్న చాలామంది ఇప్పుడు కన్నడనాట బిజీబిజీగా సినిమాలు చేస్తూ స్థిరపడిపోయారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో ఫ్లాప్ బ్యూటీ దీక్షాసేథ్ కూడా చేరింది. ఇన్నాళ్లూ తెలుగు-తమిళ సినిమాలతో లక్ చెక్ చేసుకున్న ఈ బ్యూటీ.. ఎక్కడా కాలం కలిసిరాకపోవడంతో కన్నడబాట పట్టింది. దర్శన్ హీరోగా జగ్గూ దాదా అనే సినిమా చేసింది. ఈ సినిమా హిట్టయితే కన్నడనాటైనా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్-సెంటిమెంట్ ప్రకారం దీక్షాకు క్లిక్కయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
First Published:  10 Aug 2015 7:03 PM GMT
Next Story