Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 171

నోరు తెరవలేదు గుండమ్మ గారి భర్త చనిపోయాడు. ఆయన కర్మ కాండలైపోయాక ఊర్లో వాళ్లు వాళ్ల పిల్లల్ని అడిగారు. “మీ నాన్న చనిపోతూ చనిపోతూ ఆఖరి మాటలు ఏం చెప్పారు” అని. “ఆయనేం మాట్లాడతాడు. చనిపోయేటప్పుడు కూడా పక్కనే మా అమ్మ ఉంది కదా. నోరు తెరవలేదు” అన్నారు. ————————————————————– రాత “నువ్వు కుడి చేత్తో రాస్తావా? ఎడమ చేత్తో రాస్తావా?” నాలుగవ తరగతిలో చేరడానికి వచ్చిన విద్యార్థిని అడిగాడు హెడ్‌మాస్టర్‌.”పెన్సిల్‌తో రాస్తాను” ————————————————————– ముందుజాగ్రత్త “ఎవరికైనా […]

నోరు తెరవలేదు
గుండమ్మ గారి భర్త చనిపోయాడు. ఆయన కర్మ కాండలైపోయాక ఊర్లో వాళ్లు వాళ్ల పిల్లల్ని అడిగారు. “మీ నాన్న చనిపోతూ చనిపోతూ ఆఖరి మాటలు ఏం చెప్పారు” అని.
“ఆయనేం మాట్లాడతాడు. చనిపోయేటప్పుడు కూడా పక్కనే మా అమ్మ ఉంది కదా. నోరు తెరవలేదు” అన్నారు.
————————————————————–
రాత
“నువ్వు కుడి చేత్తో రాస్తావా? ఎడమ చేత్తో రాస్తావా?” నాలుగవ తరగతిలో చేరడానికి వచ్చిన విద్యార్థిని అడిగాడు హెడ్‌మాస్టర్‌.”పెన్సిల్‌తో
రాస్తాను”
————————————————————–
ముందుజాగ్రత్త
“ఎవరికైనా అనుకోకుండా షాక్‌ తగిలితే ఫస్ట్‌ ఎయిడ్‌ ఏంటి డాక్టర్‌” ఫోన్లో అడిగింది శిరీష.
“ఎందుకడుగుతున్నారు? ఎనీ ప్రాబ్లెమ్‌?” ప్రశ్నించాడు డాక్టర్‌.
“ఏం లేదు. మా ఆయన ఇంటి ఖర్చులకని ఇచ్చిన డబ్బులు పెట్టి పట్టుచీర కొనేసుకున్నాను. ఆయనకి ఆ విషయం చెప్పేక ఏం చేయాలా అని” తాపీగా చెప్పింది శిరీష.
————————————————————–
బ్యూటీపార్లర్‌
“మా సూపర్‌ మార్కెట్‌ పక్కనే నన్నొక బ్యూటీ పార్లర్‌ పెట్టుకోమంటున్నారే మా ఆయన.”
“ఏం, ఎందుకని?”
“మా షాప్‌లో మిగిలిపోయిన పళ్లు, కాయగూరలతో ఫేస్‌ ఫ్యాక్‌లవీ వేసేసేననుకో బోలెడు లాభం వస్తుంది కదా!!!”
————————————————————–
ట్రైనింగ్‌
“మీ అత్తగారు వచ్చేరని సెలవు పెట్టావు కదా! ఆవిడని బయటికి తీసుకెళ్లి ఊరంతా చూపించారా?”
“అంత ఖాళీ ఎక్కడుందిరా! వాళ్లమ్మాయికి ఇష్టమైన వంటలు ఎలా చేయాలో, ఇల్లు శుభ్రంగా ఎలా ఉంచాలో, బట్టలు ఎలా ఉతకాలో నాకు ట్రైనింగ్‌ ఇచ్చి వెళ్లడానికి వచ్చిందావిడ!!!”

First Published:  10 Aug 2015 1:03 PM GMT
Next Story