Telugu Global
Cinema & Entertainment

దుబాయ్ లో భూమిక కొత్త బిజినెస్

తెలుగు, తమిళ భాషల్లో ఓ వెలుగువెలిగిన తార భూమిక. యోగా గురువు భరత్ ఠాకూర్ ను పెళ్లాడిన తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఓ 2 సినిమాల్లో నటించినా అవేవీ కలిసిరాలేదు. తన భర్తనే నిర్మాతగా మార్చి 2-3 సినిమాలు నిర్మించినప్పటికీ అవి కూడా హిట్ కాలేదు. దీంతో భూమిక ఇప్పుడు తనకు బాగా తెలిసిన ఓ బిజినెస్ షురూ చేసింది. అదే యోగా స్కూల్. భర్త, కొడుకుతో కలిసి ఇప్పటికే దుబాయ్ […]

దుబాయ్ లో భూమిక కొత్త బిజినెస్
X
తెలుగు, తమిళ భాషల్లో ఓ వెలుగువెలిగిన తార భూమిక. యోగా గురువు భరత్ ఠాకూర్ ను పెళ్లాడిన తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఓ 2 సినిమాల్లో నటించినా అవేవీ కలిసిరాలేదు. తన భర్తనే నిర్మాతగా మార్చి 2-3 సినిమాలు నిర్మించినప్పటికీ అవి కూడా హిట్ కాలేదు. దీంతో భూమిక ఇప్పుడు తనకు బాగా తెలిసిన ఓ బిజినెస్ షురూ చేసింది. అదే యోగా స్కూల్. భర్త, కొడుకుతో కలిసి ఇప్పటికే దుబాయ్ లో సెటిలైపోయిన ఈ బ్యూటీ, ఇప్పుడు అక్కడ ఓ పెద్ద యోగా స్కూల్ స్టార్ట్ చేసింది. దుబాయ్ లో ఔత్సాహికులకు యోగాలో శిక్షణ ఇస్తోంది. ఇటు భర్త భరత్ మాత్రం ఇండియాలో సెలబ్రిటీలకు యోగాలో శిక్షణ ఇస్తున్నాడు. అలా ఇద్దరూ కలిసి యోగానే జీవితంలా బతికేస్తున్నారు. రాబోయే రోజుల్లో యూరోప్ దేశాల్లో మరిన్ని యోగా సెంటర్లు తెరుస్తానంటోంది భూమిక. తనకు ఎంతో ఇష్టమైన పనినే ఇప్పుడు వ్యాపారంగా కూడా మార్చుకోవడం చాలా ఆనందంగా ఉందంటోంది. ఇలా వ్యాపార కార్యక్రమాలతో బిజీగా ఉంటోంది కాబట్టే ఈమధ్య వచ్చిన రెండు సినిమా ఆఫర్లను కూడా వదిలేసుకుంది భూమిక. కొన్నాళ్ల పాటు బిజినెస్ పనులు చూసుకొని, తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది.
First Published:  10 Aug 2015 7:02 PM GMT
Next Story