Telugu Global
Others

ఆర్టీసీ చైర్మ‌న్ భ‌వ‌నంపై స‌ర్కార్ క‌న్ను 

తెలంగాణ ప్ర‌భుత్వం క‌న్ను ఆర్టీసీ చైర్మ‌న్ భ‌వ‌నంపై ప‌డింది.  తీవ్రమైన న‌ష్టాల‌తో  సంస్థ  ఆర్థికంగా కుదేలై ఉండ‌గా, సంస్థ‌కున్న విలువైన భూముల‌పై స‌ర్కార్ క‌న్ను ప‌డింది. తార్నాక ప్ర‌ధాన ర‌హ‌దారిపై రెండెక‌రాల సువిశాలమైన విస్తీర్ణంలో  ఆర్టీసీ చైర్మ‌న్ భ‌వ‌నం ఉంది. ఈ భ‌వ‌నం  అత్యంత విలువైన ప్రాంతంలో ఉండ‌డంతో దీనిని ఆర్టీసీ వాణిజ్య స‌ముదాయంగా మార్చాల‌ని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఇటీవ‌ల ఆ భ‌వ‌నాన్ని ప‌రిశీలించి వెళ్లారు. గ‌తంలో ఆయ‌న ర‌వాణా మంత్రిగా ప‌ని […]

ఆర్టీసీ చైర్మ‌న్ భ‌వ‌నంపై స‌ర్కార్ క‌న్ను 
X
తెలంగాణ ప్ర‌భుత్వం క‌న్ను ఆర్టీసీ చైర్మ‌న్ భ‌వ‌నంపై ప‌డింది. తీవ్రమైన న‌ష్టాల‌తో సంస్థ ఆర్థికంగా కుదేలై ఉండ‌గా, సంస్థ‌కున్న విలువైన భూముల‌పై స‌ర్కార్ క‌న్ను ప‌డింది. తార్నాక ప్ర‌ధాన ర‌హ‌దారిపై రెండెక‌రాల సువిశాలమైన విస్తీర్ణంలో ఆర్టీసీ చైర్మ‌న్ భ‌వ‌నం ఉంది. ఈ భ‌వ‌నం అత్యంత విలువైన ప్రాంతంలో ఉండ‌డంతో దీనిని ఆర్టీసీ వాణిజ్య స‌ముదాయంగా మార్చాల‌ని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఇటీవ‌ల ఆ భ‌వ‌నాన్ని ప‌రిశీలించి వెళ్లారు. గ‌తంలో ఆయ‌న ర‌వాణా మంత్రిగా ప‌ని చేసిన స‌మ‌యంలో ఆ భ‌వ‌నంలోనే అధికారికంగా నివాసం ఉన్నారు. ఆయ‌న ఇప్పుడు హ‌టాత్తుగా ఈ భ‌వ‌నాన్ని ప‌రిశీలించి వెళ్ల‌డంతో స‌ర్కార్ క‌న్ను ఈ భ‌వ‌నంపై ఉంద‌ని ఆర్టీసీ ఉద్యోగుల్లో గుస‌గుస‌లు ప్రారంభ‌మ‌య్యాయి.
First Published:  9 Aug 2015 1:11 PM GMT
Next Story