Telugu Global
Cinema & Entertainment

తమిళనాట కూడా కుమ్మేస్తున్నాడు

మహేశ్-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన శ్రీమంతుడు సినిమా తెలుగు నాట ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఒక్కరు కూడా ఈ సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడిన దాఖలాలు లేవు. అలా కంప్లీట్ పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అయితే ఇప్పుడీ సినిమా తమిళనాట కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. సాధారణంగా తెలుగు సినిమాలు తమిళనాట ఆడేది అంతంతమాత్రమే. కానీ సెల్వంధన్ గా తమిళనాట విడుదలైన శ్రీమంతుడు మాత్రం అక్కడ రికార్డు వసూళ్లు సృష్టిస్తోంది. […]

తమిళనాట కూడా కుమ్మేస్తున్నాడు
X
మహేశ్-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన శ్రీమంతుడు సినిమా తెలుగు నాట ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఒక్కరు కూడా ఈ సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడిన దాఖలాలు లేవు. అలా కంప్లీట్ పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అయితే ఇప్పుడీ సినిమా తమిళనాట కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. సాధారణంగా తెలుగు సినిమాలు తమిళనాట ఆడేది అంతంతమాత్రమే. కానీ సెల్వంధన్ గా తమిళనాట విడుదలైన శ్రీమంతుడు మాత్రం అక్కడ రికార్డు వసూళ్లు సృష్టిస్తోంది. దీంతో కోలీవుడ్ లో సెల్వంధన్ కోసం మరిన్ని థియేటర్లు కేటాయించారు. ఈ రోజు నుంచి తమిళ వెర్షన్ కు అదనంగా మరో 20శాతం థియేటర్లను జోడించారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. సినిమా కథ తమిళ జనాలకు కూడా నచ్చడం, శృతిహాసన్ తో కోలీవుడ్ బాగా కనెక్ట్ అవ్వడంతో సెల్వంధన్ మూవీ తమిళనాట కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. మరోవైపు ఈ సినిమా ఓవరాల్ వసూళ్లు అత్తారింటికి దారేది సినిమాను క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్తారింటికి దారేది సినిమా హోల్ అండ్ సోల్ గా 90కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఫుల్ రన్ లో శ్రీమంతుడు మూవీ ఆ ఘనతను సాధించి వంద కోట్ల రూపాయల చిత్రంగా అవతరించే అవకాశాలున్నాయని లెక్కలేస్తున్నారు.
First Published:  9 Aug 2015 7:00 PM GMT
Next Story