Telugu Global
Others

ఊపందుకుంటున్న ప్రత్యేక హోదా ఉద్యమం

ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఉద్యమం ఊపందుకుంది. కాంగ్రెస్‌ కార్యకర్త మునికోటి ఆత్మహత్యతో ఉద్రిక్తంగా మారిన తిరుపతిలో కాంగ్రెస్‌, వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు సంపూర్ణ బంద్‌ జరుగుతోంది. మరోవైపు చెన్నైలో మునికోటి పోస్టుమార్టం పూర్తయ్యింది.  కోటి మృతదేహాన్ని తీసుకురావడానికి చెన్నై వెళ్ళిన కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవి దగ్గరుండి తిరుపతికి తీసుకువస్తున్నారు. వీరితోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మునికోటి అంత్యక్రియలు జరుగుతాయి. స్వచ్ఛందంగా బంద్‌ […]

ఊపందుకుంటున్న ప్రత్యేక హోదా ఉద్యమం
X
ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఉద్యమం ఊపందుకుంది. కాంగ్రెస్‌ కార్యకర్త మునికోటి ఆత్మహత్యతో ఉద్రిక్తంగా మారిన తిరుపతిలో కాంగ్రెస్‌, వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు సంపూర్ణ బంద్‌ జరుగుతోంది. మరోవైపు చెన్నైలో మునికోటి పోస్టుమార్టం పూర్తయ్యింది. కోటి మృతదేహాన్ని తీసుకురావడానికి చెన్నై వెళ్ళిన కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవి దగ్గరుండి తిరుపతికి తీసుకువస్తున్నారు. వీరితోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మునికోటి అంత్యక్రియలు జరుగుతాయి.
స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్న తిరుపతి
మరోవైపు తిరుపతిలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. సినిమా థియేటర్లు, వాణిజ్య వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నాయి. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సుల రాకపోకలను అడ్డుకోవద్దని ఆయా పార్టీల నేతలు నిర్ణయించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం అవసరమని, ఉద్యమం ద్వారానే సాధించుకోవాలని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు.
సీపీఐ నేతలు మాట్లాడుతూ ఈ ఆందోళనలు పతాక స్థాయికి తీసుకువెళ్లి… కేంద్రం మెడలు వంచి రాష్ర్టానికి ప్రత్యేక హోదా, అదే విధంగా రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చేవరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపు ఇచ్చే అవకాశం ఉందని, పార్టీ నేతలతో చర్చించి ఈ సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సీపీఐ వెల్లడించింది.
విజయవాడ, విశాఖలో ఆందోళనలు
మరోవైపు… ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ విజయవాడ, విశాఖ నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో భారీ ర్యాలీ జరిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు సీపీఐ విశాఖ నగరంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఊపందుకుంటోంది. విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ నుంచి చుట్టుగుంట రోడ్డు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర విద్యార్థులు ర్యాలీగా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు నేతృత్వం వహిస్తున్నాయి.
First Published:  10 Aug 2015 12:57 AM GMT
Next Story