Telugu Global
Cinema & Entertainment

చెర్రీ-వైట్ల సినిమా టాకీ పార్ట్ పూర్తి

అనుకున్న గడువు కంటే ముందే రామ్ చరణ్ తో సినిమా పూర్తిచేశాడు దర్శకుడు శ్రీనువైట్ల. సినిమా ముహూర్తం షాట్ నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేశాడు. తాజాగా బ్యాంకాంక్, థాయ్ లాండ్ షెడ్యూల్స్ కూడా పూర్తిచేశాడు. ఈ ప్రాంతాల్లో సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ఈరోజు లేదా రేపు చరణ్ అండ్ వైట్ల టీం హైదరాబాద్ తిరిగొస్తుంది. హైదరాబాద్ లో ఓ రెండు పాటల షూటింగ్ తో పాటు కొంత ప్యాచ్ వర్క్ షూటింగ్ […]

చెర్రీ-వైట్ల సినిమా టాకీ పార్ట్ పూర్తి
X
అనుకున్న గడువు కంటే ముందే రామ్ చరణ్ తో సినిమా పూర్తిచేశాడు దర్శకుడు శ్రీనువైట్ల. సినిమా ముహూర్తం షాట్ నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేశాడు. తాజాగా బ్యాంకాంక్, థాయ్ లాండ్ షెడ్యూల్స్ కూడా పూర్తిచేశాడు. ఈ ప్రాంతాల్లో సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ఈరోజు లేదా రేపు చరణ్ అండ్ వైట్ల టీం హైదరాబాద్ తిరిగొస్తుంది. హైదరాబాద్ లో ఓ రెండు పాటల షూటింగ్ తో పాటు కొంత ప్యాచ్ వర్క్ షూటింగ్ పూర్తిచేస్తారు. దీంతో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే అక్టోబర్ లో విడుదల చేయాలనుకున్న సినిమాను ఆగస్ట్ నెలాఖరుకే పూర్తిచేస్తున్నాడన్నమాట. ఇక అప్పట్నుంచి ఆడియో విడుదల, సినిమా ప్రమోషన్ పై దృష్టిపెట్టాలని భావిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేసినప్పటికీ గోప్యంగా ఉంచుతున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న టైటిల్ ను గ్రాండ్ గా ప్రకటిస్తారు. ఇక సెప్టెంబర్ లో ఆడియో విడుదల చేసి, అక్టోబర్ 15న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. మూవీలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
First Published:  9 Aug 2015 7:01 PM GMT
Next Story