Telugu Global
Cinema & Entertainment

ప్రిన్స్ "బ్రహ్మోత్సవం" సమ్మర్ లోనే.. 

మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమాకు సంబంధించిన సంగతి కాదిది. ఆయన నటించబోయే కొత్త సినిమా బ్రహ్మోత్సవానికి సంబంధించిన వార్త. మహేష్ పుట్టినరోజు సందర్భంగా పూజాకార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇప్పటివరకు ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాను వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీనికి ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్ ఓ 10 రోజుల పాటు విహార యాత్రకు వెళ్లబోతున్నాడు. మధ్యలో రెండు […]

ప్రిన్స్ బ్రహ్మోత్సవం సమ్మర్ లోనే.. 
X
మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమాకు సంబంధించిన సంగతి కాదిది. ఆయన నటించబోయే కొత్త సినిమా బ్రహ్మోత్సవానికి సంబంధించిన వార్త. మహేష్ పుట్టినరోజు సందర్భంగా పూజాకార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇప్పటివరకు ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాను వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీనికి ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్ ఓ 10 రోజుల పాటు విహార యాత్రకు వెళ్లబోతున్నాడు. మధ్యలో రెండు యాడ్ షూటింగ్స్ లో కూడా పాల్గొంటాడు. మరో కారణం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల టేకింగ్. సినిమా మేకింగ్ కు సంబంధించి అడ్డాలకు కాస్త ఎక్కువ టైం కావాలి. అందుకే సంక్రాంతికి కుదరదని ముందుగానే భావించి సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. సినిమా షూటింగ్ కు 5 నెలల టైం కేటాయించారు. రేపోమాపో మహేష్ విదేశీ పర్యటనకు వెళ్తున్నాడు. అట్నుంచి తిరిగిరాగానే బ్రహ్మోత్సవం సినిమా పట్టాలపైకి వస్తుంది. సినిమాలో మహేష్ సరసన కాజల్, ప్రణీత, సమంత హీరోయిన్లుగా నటిస్తారు.
Next Story