Telugu Global
Cinema & Entertainment

పవన్ తో రొమాన్స్ కి రెడీ  అంటున్న కాజల్

అంతా అనుకున్నట్టే జరిగింది. గబ్బర్ సింగ్ -2 ప్రాజెక్ట్ కోసం మొట్టమొదట ఏ హీరోయిన్ ను అయితే అనుకున్నారో ఫైనల్ గా ఆ భామే సెలక్ట్ అయింది. ఎంతోమందిని ఊరించిన గబ్బర్ సింగ్-2 సినిమా ఛాన్స్ చుట్టూతిరిగి కాజల్ నే వరించింది. సర్దార్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ ను సందర్శించింది కాజల్. నిర్మాత పిలుపుమేరకు సెట్స్ కు వచ్చిన కాజల్, అక్కడే కథాచర్చల్లో పాల్గొంది. దర్శకుడు బాబి చెప్పిన స్టోరీ మొత్తం విని, అక్కడే […]

పవన్ తో రొమాన్స్ కి రెడీ  అంటున్న కాజల్
X
అంతా అనుకున్నట్టే జరిగింది. గబ్బర్ సింగ్ -2 ప్రాజెక్ట్ కోసం మొట్టమొదట ఏ హీరోయిన్ ను అయితే అనుకున్నారో ఫైనల్ గా ఆ భామే సెలక్ట్ అయింది. ఎంతోమందిని ఊరించిన గబ్బర్ సింగ్-2 సినిమా ఛాన్స్ చుట్టూతిరిగి కాజల్ నే వరించింది. సర్దార్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ ను సందర్శించింది కాజల్. నిర్మాత పిలుపుమేరకు సెట్స్ కు వచ్చిన కాజల్, అక్కడే కథాచర్చల్లో పాల్గొంది. దర్శకుడు బాబి చెప్పిన స్టోరీ మొత్తం విని, అక్కడే అగ్రిమెంట్ పై సంతకం చేసింది. ఈ నెలలోనే షూటింగ్ కు వచ్చేలా డేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసింది కాజల్. అలా సర్దార్ సినిమా ఛాన్స్ కాజల్ వశమైంది. గోపాల గోపాల మూవీలో కనిపించిన అనీషా ఆంబ్రోస్ అనే అమ్మాయిని ఈ సినిమా కోసం దాదాపు కన్ ఫర్మ్ చేశారు. పవన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంచేశాడు. ఆమెతో దిగిన సెల్ఫీలు కూడా వచ్చేశాయి. అయితే రోజులుగడిచేకొద్దీ అనీషా ఫేట్ మారిపోయింది. సర్దార్ లో ఛాన్స్ కోల్పోయింది. తర్వాత ఎంతోమంది పేర్లు పరిశీలించినప్పటికీ.. ఫైనల్ గా కాజల్ కే ఫిక్స్ అయింది యూనిట్. అలా పవన్-కాజల్ ఫ్రెష్ కాంబినేషన్ లో సర్దార్ సినిమా తెరకెక్కుతోంది. పవన్-కాజల్ కలిసి నటించనున్న సన్నివేశాల్ని ఈ నెలాఖరు నుంచి పిక్చరైజ్ చేస్తారు.
First Published:  9 Aug 2015 7:03 PM GMT
Next Story