Telugu Global
NEWS

చెత్త నుంచి డీజిల్ 

హైద‌రాబాద్‌లో ప్ర‌తి రోజూ ట‌న్నుల కొద్దీ చెత్త పేరుకు పోతుంది.ఈ చెత్త‌ను డంప్ యార్డుల‌కు త‌ర‌లించ‌డంతో పాటు దీనిని రీసైక్లింగ్ చేసేందుకు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టికే విద్యుత్ త‌యారీ ప్లాంటుకు  చెత్త‌ను స‌ర‌ఫ‌రా చేస్తోన్న బ‌ల్దియా ప్లాస్టిక్‌, కాగితం, గ్లాసు వ్య‌ర్ధాల‌ను కూడా రీసైక్లింగ్ చేయాల‌ని నిర్ణ‌యించింది. స్వ‌చ్ఛ‌హైద‌రాబాద్‌లో త‌ర‌లించిన 80 వేల మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్ధాల్లో 50వేల ట‌న్నులు నిర్మాణ వ్య‌ర్థాలున్నాయని గుర్తించారు. స్వ‌చ్ఛ‌హైద‌రాబాద్ బృందం ఢిల్లీలో  ప‌ర్య‌టించి డెబ్రిస్ రీసైక్లింగ్ విధానంపై అధ్య‌య‌నం […]

చెత్త నుంచి డీజిల్ 
X
హైద‌రాబాద్‌లో ప్ర‌తి రోజూ ట‌న్నుల కొద్దీ చెత్త పేరుకు పోతుంది.ఈ చెత్త‌ను డంప్ యార్డుల‌కు త‌ర‌లించ‌డంతో పాటు దీనిని రీసైక్లింగ్ చేసేందుకు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టికే విద్యుత్ త‌యారీ ప్లాంటుకు చెత్త‌ను స‌ర‌ఫ‌రా చేస్తోన్న బ‌ల్దియా ప్లాస్టిక్‌, కాగితం, గ్లాసు వ్య‌ర్ధాల‌ను కూడా రీసైక్లింగ్ చేయాల‌ని నిర్ణ‌యించింది. స్వ‌చ్ఛ‌హైద‌రాబాద్‌లో త‌ర‌లించిన 80 వేల మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్ధాల్లో 50వేల ట‌న్నులు నిర్మాణ వ్య‌ర్థాలున్నాయని గుర్తించారు. స్వ‌చ్ఛ‌హైద‌రాబాద్ బృందం ఢిల్లీలో ప‌ర్య‌టించి డెబ్రిస్ రీసైక్లింగ్ విధానంపై అధ్య‌య‌నం చేసింది. డెబ్రిస్‌తో టైల్స్‌, ఇటుక‌లు త‌దిత‌ర వ‌స్తువులు త‌యారు చేస్తున్నార‌ని ఈ విధానాన్ని హైద‌రాబాద్‌లో కూడా ప్ర‌వేశ పెట్టాల‌ని సూచించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు బోర‌బండ‌లోని 10 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని డెబ్రిస్ పున‌ర్వినియోగానికి ఉప‌యోగించాల‌ని నిర్ణ‌యించారు. ఆస‌క్తి గ‌ల‌వారు ముందుకు రావాల‌ని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. ప్లాస్టిక్ వ్య‌ర్ధాల‌తో త‌యారు చేసే డీజిల్ కూడా మార్కెట్లో ఉన్న డీజిల్ ధ‌ర కంటే స‌గం ధ‌ర‌లోనే ల‌భిస్తుంది. అధికారులు దీనిపై అధ్య‌య‌నం చేయాల‌ని క‌మిష‌న‌ర్ సోమేష్ కుమార్ ఆదేశించారు.
First Published:  10 Aug 2015 1:20 AM GMT
Next Story