Telugu Global
Cinema & Entertainment

ఆసిన్  కు పెళ్లి కొడుకు దొరికాడు..?

అన్ని సినిమాలు   రియ‌ల్ కాదు. కొన్ని సినిమా క‌ధ‌లు  రియ‌ల్ లైఫ్ స్టోరిసే,. సినిమాలో పోషించిన  రోల్   నిజ జీవితంలో  నిజం కావ‌డం  చాల యాదృచ్చికంగా జ‌రుగుతుంటుంది.    మ‌ల్బార్ బ్యూటీ ఆసీన్ విష‌యంలో అదే జ‌రిగింది.  గ‌జ‌నీ చిత్రంలో  సంజ‌య్ సింఘానియ అని ఒక మొబైల్ కంపెనీ  అధినేత ను ల‌వ్ చేస్తుంది.  అది సినిమాలో  క‌థ ప‌రంగా  జ‌రిగింది. అయితే తాజా గా  ఆసీన్ రాహుల్ శ‌ర్మ అనే    ఒక బిలియ‌నీర్ ను పెళ్లి చేసుకోబోతుంది. […]

ఆసిన్  కు పెళ్లి కొడుకు దొరికాడు..?
X

అన్ని సినిమాలు రియ‌ల్ కాదు. కొన్ని సినిమా క‌ధ‌లు రియ‌ల్ లైఫ్ స్టోరిసే,. సినిమాలో పోషించిన రోల్ నిజ జీవితంలో నిజం కావ‌డం చాల యాదృచ్చికంగా జ‌రుగుతుంటుంది. మ‌ల్బార్ బ్యూటీ ఆసీన్ విష‌యంలో అదే జ‌రిగింది. గ‌జ‌నీ చిత్రంలో సంజ‌య్ సింఘానియ అని ఒక మొబైల్ కంపెనీ అధినేత ను ల‌వ్ చేస్తుంది. అది సినిమాలో క‌థ ప‌రంగా జ‌రిగింది. అయితే తాజా గా ఆసీన్ రాహుల్ శ‌ర్మ అనే ఒక బిలియ‌నీర్ ను పెళ్లి చేసుకోబోతుంది. 36 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న రాహుల్ మైక్రో మాక్స్ మొబైల్ కంపెనీ అధినేత‌. ఇత‌న్ని పెళ్లి చేసుకో బోతున్న‌ట్లు ఆసీన్ తెలిపింది.

గ‌జ‌నీ చిత్రం త‌రువాత ఆసీన్ బాలీవుడ్ లో కొన్ని చిత్రాలు చేసింది. అయితే త‌న కెరీర్ ఆశించ‌నంత గా అక్క‌డ స‌క్సెస్ కాలేదు. దీంతో బ్యాక్ టు పెవిలియ‌న్ అని సౌత్ కు వ‌చ్చి..ఒక‌టి రెండు చిత్రాలు చేసింది. కానీ ఇక్క‌డ కూడా యంగ్ హీరోయిన్స్ త‌న ప్లేస్ ను క‌బ్జా చేయ‌డంతో.. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఖాళీగా నే ఉంది. ఇక పెళ్లి పీట‌లెక్క‌డం ఎప్పుడు అనేది తెలియాల్సి వుంది మ‌రి.

First Published:  10 Aug 2015 1:57 AM GMT
Next Story