Telugu Global
Others

మునికోటి మృతి... తిరుపతి బంద్‌కు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శనివారం తిరుపతి కాంగ్రెస్‌ సభలో వంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న కాంగ్రెస్‌ కార్యకర్త మునికోటి చెన్నై కెఎంసిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. 70 శాతం కాలిపోయిన శరీరంతో ఉన్న అతన్ని మెరుగైన వైద్యం అందించేందుకు ఈ రోజు ఉదయమే వేలూరు సీఎంసీ నుంచి చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మునికోటి చనిపోయారు. ఈ విషయాన్ని వైద్య బృందం కూడా ధృవీకరించింది. మునికోటి ఆత్మహత్యకు కేంద్ర, […]

మునికోటి మృతి... తిరుపతి బంద్‌కు పిలుపు
X

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శనివారం తిరుపతి కాంగ్రెస్‌ సభలో వంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న కాంగ్రెస్‌ కార్యకర్త మునికోటి చెన్నై కెఎంసిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. 70 శాతం కాలిపోయిన శరీరంతో ఉన్న అతన్ని మెరుగైన వైద్యం అందించేందుకు ఈ రోజు ఉదయమే వేలూరు సీఎంసీ నుంచి చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మునికోటి చనిపోయారు. ఈ విషయాన్ని వైద్య బృందం కూడా ధృవీకరించింది. మునికోటి ఆత్మహత్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం తిరుపతి బంద్‌కు పిలుపు ఇచ్చింది. తిరుపతి మంచాల వీథిలోని టీ.నగర్‌ కాలనీకి చెందిన మునికోటి సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయనకు తల్లి దండ్రులు లేరు. భార్య నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో తాతయ్య కుంట గంగమ్మ ఆలయంలో ఓ కమిటీ సభ్యునిగా పనిచేశారు. కాంగ్రెస్‌ నేత మబ్బు చెంగారెడ్డి అనుచరునిగా వ్యవహరిస్తున్న మునికోటి తాను సంచలనం సృష్టించబోతున్నట్లు మూడు రోజుల క్రితమే తన స్నేహితులతో చెప్పినట్లుగా తెలియవచ్చింది. ఆత్మహత్యాయత్నం చేస్తాడని తాము ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే తాను అత్మహత్యాయత్నం చేశానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. సోమవారం తిరుపతి బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని తిరుపతి వాసులకు కాంగ్రెస్‌ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముని కోటి అంత్యక్రియలు తిరుపతిలో జరుగుతాయి. అంత్యక్రియలకు రఘువీరా రెడ్డి హాజరుకానున్నారు.
మునికోటి మృతికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేస్తూ మునికోటి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎవరూ భావోద్వేగాలకు లోను కావద్దని చంద్రబాబు సూచించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ మునికోటి మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన మునికోటిని చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. అతడి ఆత్మహత్యకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని అన్నారు.
రేపు తిరుపతి బంద్‌కు కాంగ్రెస్‌ పిలుపు

First Published:  9 Aug 2015 10:16 AM GMT
Next Story