Telugu Global
Others

ప్రాణ‌హిత చేవెళ్ల‌పై రంగారెడ్డి జెడ్పీలో రసాభాస 

కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధుల తీవ్ర నిర‌స‌న‌ల‌తో శ‌నివారం జ‌రిగిన రంగారెడ్డి జెడ్పీ స‌మావేశం తీవ్ర ర‌సాభాస‌గా మారింది. ప్రాణహిత‌-చేవెళ్ల ప్రాజెక్టును మెద‌క్ జిల్లా వ‌ర‌కే కుదిస్తున్నార‌న్న వార్త‌లతో స‌మావేశం అట్టుడికి పోయింది. ప్రాజెక్టు డిజైన్ మార్చి ద‌క్షిణ తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్నార‌ని కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధులు ఆరోపించారు. సౌత్ తెలంగాణ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి జిల్లా ప‌రిష‌త్‌ను మార్మోగించడంతో పాటు జెడ్పీ హాల్లోనే ధ‌ర్నాకు దిగారు. కార్యాల‌యం బైట  యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ  నేత‌లు ఆందోళ‌న చేశారు. […]

ప్రాణ‌హిత చేవెళ్ల‌పై రంగారెడ్డి జెడ్పీలో రసాభాస 
X
కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధుల తీవ్ర నిర‌స‌న‌ల‌తో శ‌నివారం జ‌రిగిన రంగారెడ్డి జెడ్పీ స‌మావేశం తీవ్ర ర‌సాభాస‌గా మారింది. ప్రాణహిత‌-చేవెళ్ల ప్రాజెక్టును మెద‌క్ జిల్లా వ‌ర‌కే కుదిస్తున్నార‌న్న వార్త‌లతో స‌మావేశం అట్టుడికి పోయింది. ప్రాజెక్టు డిజైన్ మార్చి ద‌క్షిణ తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్నార‌ని కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధులు ఆరోపించారు. సౌత్ తెలంగాణ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి జిల్లా ప‌రిష‌త్‌ను మార్మోగించడంతో పాటు జెడ్పీ హాల్లోనే ధ‌ర్నాకు దిగారు. కార్యాల‌యం బైట యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ నేత‌లు ఆందోళ‌న చేశారు. జెడ్పీ స‌మావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ టి.రామ్మోహ‌న్‌రెడ్డికి, ర‌వాణా మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డికి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ప్రాణిహిత చేవెళ్ల ప్రాజెక్టు నీరు రంగారెడ్డి జిల్లాకు అందేలా జడ్పీలో ప్ర‌క‌ట‌న చేయాల‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప‌ట్టుబ‌ట్ట‌గా మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డి నిరాక‌రించారు. ప్ర‌భుత్వం అలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు క‌నుక ప్ర‌క‌ట‌న చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌కు, టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది.
First Published:  8 Aug 2015 1:11 PM GMT
Next Story