Telugu Global
Cinema & Entertainment

బాహుబలి కోసం ప్రభాస్ త్యాగాలు

ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా త్యాగాల మీద త్యాగాలు చేస్తూనే ఉన్నాడు ప్రభాస్. అంతా బాహుబలి కోసమే. చక్కగా పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన టైమ్ లో బాహుబలి ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడు ప్రభాస్. దీంతో పెళ్లిని కొన్నేళ్ల పాటు త్యాగం చేశాడు. ఇప్పుడు తాజాగా బాహుబలి పార్ట్-2 కంప్లీట్ అయిన తర్వాతే పెళ్లి అంటున్నాడు. పర్సనల్ లైఫ్ తో పాటు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వదిలేసుకుంటున్నాడు. బాహుబలి పార్ట్-1 తర్వాత సుజిత్ […]

బాహుబలి కోసం ప్రభాస్ త్యాగాలు
X
ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా త్యాగాల మీద త్యాగాలు చేస్తూనే ఉన్నాడు ప్రభాస్. అంతా బాహుబలి కోసమే. చక్కగా పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన టైమ్ లో బాహుబలి ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడు ప్రభాస్. దీంతో పెళ్లిని కొన్నేళ్ల పాటు త్యాగం చేశాడు. ఇప్పుడు తాజాగా బాహుబలి పార్ట్-2 కంప్లీట్ అయిన తర్వాతే పెళ్లి అంటున్నాడు. పర్సనల్ లైఫ్ తో పాటు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వదిలేసుకుంటున్నాడు. బాహుబలి పార్ట్-1 తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేద్దామనుకున్నాడు. కానీ బాహుబలి పార్ట్-2 షూటింగ్ వచ్చే నెల నుంచి ఉండడంతో సుజిత్ సినిమాను పక్కనపెట్టేశాడు. ఇప్పుడీ త్యాగాలకు అదనంగా మరో త్యాగం కూడా చేశాడు ప్రభాస్. బాహుబలి పార్ట్-2 షూటింగ్ కోసం బంగారం లాంటి కమర్షియల్ యాడ్ ను కూడా వదిలేశాడు. బాహుబలి క్రేజ్ తో ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆఫర్ వచ్చింది ప్రభాస్ కి. కాంట్రాక్ట్ లో సంతకం కూడా చేశాడు ప్రభాస్. కానీ రాజమౌళి వారించడంతో.. కాంట్రాక్ట్ ను రద్దుచేసుకొని వాళ్ల డబ్బు వాళ్లకు తిరిగిచ్చేశాడు. ఇలా బాహుబలి ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ త్యాగాల మీద త్యాగాలు చేస్తూనే ఉన్నాడు. భవిష్యత్తులో ఈ హీరో ఇంకెన్ని త్యాగాలు చేస్తాడో చూడాలి.
First Published:  8 Aug 2015 7:02 PM GMT
Next Story