Telugu Global
Cinema & Entertainment

సెప్టెంబర్ నుంచి శ్రీశాంత్ సినిమా

స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి క్లీన్ చిట్ అందుకున్న శ్రీశాంత్ త్వరలోనే వెండితెరపై కూడా మెరవబోతున్నాడు. సానా యాదిరెడ్డి దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతున్నాడు ఈ ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. కథా చర్చలు కూడా సాగుతున్నాయి. అన్నీ ఫైనలైజ్ చేసి సెప్టెంబర్ నుంచి సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నారు. అక్కడ్నుంచి ఏకథాటిగా 6 నెలల పాటు షూటింగ్ జరపాలని నిర్ణయించారు. తెలుగు-తమిళ భాషల్లో సినిమా […]

సెప్టెంబర్ నుంచి శ్రీశాంత్ సినిమా
X
స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి క్లీన్ చిట్ అందుకున్న శ్రీశాంత్ త్వరలోనే వెండితెరపై కూడా మెరవబోతున్నాడు. సానా యాదిరెడ్డి దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతున్నాడు ఈ ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. కథా చర్చలు కూడా సాగుతున్నాయి. అన్నీ ఫైనలైజ్ చేసి సెప్టెంబర్ నుంచి సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నారు. అక్కడ్నుంచి ఏకథాటిగా 6 నెలల పాటు షూటింగ్ జరపాలని నిర్ణయించారు. తెలుగు-తమిళ భాషల్లో సినిమా విడుదలైన తర్వాత 11 భారతీయ భాషల్లోకి సినిమాను డబ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరైనా బాలీవుడ్ అమ్మాయిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఓ వైపు సినిమా చేస్తూనే, మరోవైపు బీసీసీఐ ఆహ్వానిస్తే ఇండియన్ క్రికెట్ టీంలో చేరతానంటున్నాడు శ్రీశాంత్. సినిమా కథాచర్చల్లో పాల్గొనడంతో పాటు మరోవైపు నెట్ ప్రాక్టీస్ కూడా షురూ చేశాడు. ప్రస్తుతం తను కంప్లీట్ ఫిట్ నెస్ తో ఉన్నానని, బీసీసీఐ ఎప్పుడు ఆహ్వానించినా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. సో.. వచ్చే ఏడాది నుంచి శ్రీశాంత్ ఇటు హీరోగా, అటు బౌలర్ గా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడన్నమాట.
First Published:  7 Aug 2015 7:00 PM GMT
Next Story