Telugu Global
Others

రెవిన్యూ, ర‌క్ష‌ణ‌శాఖ‌ మ‌ధ్య స్థ‌ల వివాదం 

ర‌క్ష‌ణ‌శాఖ ఆధీనంలో ఉన్న భూమిపై రెవిన్యూ సిబ్బందికి, ఆర్మీకి మ‌ధ్య వివాదం నెల‌కొంది. వివ‌రాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలంలోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో స‌ర్వే నంబ‌రు 502-937 మ‌ధ్య‌నున్న 617 ఎక‌రాల‌ను ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అవ‌స‌రాల కోసం 1968లో రాష్ట్ర స‌ర్కారు  లీజు ప‌ద్ద‌తిలో కేటాయించింది. క్షిప‌ణుల ప్ర‌యోగం, ఆయుధాల ప‌రీక్ష‌ల‌కు ర‌క్ష‌ణ శాఖ ఈ స్థలాన్ని ఉప‌యోగిస్తోంది. అయితే, రెండేళ్ల క్రితం ఒప్పంద కాల‌ ప‌రిమితి పూర్త‌వ‌డంతో స్థ‌లాన్ని ఖాళీ చేయాల‌ని జిల్లా రెవిన్యూ […]

రెవిన్యూ, ర‌క్ష‌ణ‌శాఖ‌ మ‌ధ్య స్థ‌ల వివాదం 
X
ర‌క్ష‌ణ‌శాఖ ఆధీనంలో ఉన్న భూమిపై రెవిన్యూ సిబ్బందికి, ఆర్మీకి మ‌ధ్య వివాదం నెల‌కొంది. వివ‌రాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలంలోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో స‌ర్వే నంబ‌రు 502-937 మ‌ధ్య‌నున్న 617 ఎక‌రాల‌ను ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అవ‌స‌రాల కోసం 1968లో రాష్ట్ర స‌ర్కారు లీజు ప‌ద్ద‌తిలో కేటాయించింది. క్షిప‌ణుల ప్ర‌యోగం, ఆయుధాల ప‌రీక్ష‌ల‌కు ర‌క్ష‌ణ శాఖ ఈ స్థలాన్ని ఉప‌యోగిస్తోంది. అయితే, రెండేళ్ల క్రితం ఒప్పంద కాల‌ ప‌రిమితి పూర్త‌వ‌డంతో స్థ‌లాన్ని ఖాళీ చేయాల‌ని జిల్లా రెవిన్యూ యంత్రాంగం ఆర్మీని కోరింది. లీజు పొడిగించాల్సిందిగా ఆర్మీ చేసిన విజ్ఞ‌ప్తిని క‌లెక్ట‌ర్ తోసిపుచ్చారు. దీంతో ఆ స్థ‌లంలో బోర్డులు నాటేందుకు రెవిన్యూ అధికారులు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఆర్మీ సిబ్బంది వారిని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఇపుడు ఈ వ్యవహారం వివాదంగా మారింది.
First Published:  7 Aug 2015 1:12 PM GMT
Next Story