Telugu Global
Others

రేపు ఢిల్లీలో జగన్‌ దీక్ష... లెఫ్ట్‌ మద్దతు: బొత్స

జగన్ దీక్ష రాజకీయ స్వార్థంతో చేస్తున్నది కాదని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే రాజకీయాలను పక్కనపెడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం ఏ పార్టీ కలిసొచ్చినా కలుపుకెళతామని చెప్పారు. ఐదు వేల మందితో సోమవారం ఢిల్లీలో జగన్ దీక్ష జరుగుతుందని బొత్స తెలిపారు. సీపీఎం, సీపీఐ నేతలతో జగన్ మాట్లాడారనీ, జగన్ దీక్షకు సీపీఎం, సీపీఐ మద్దతు పలికాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెబుతూ […]

రేపు ఢిల్లీలో జగన్‌ దీక్ష... లెఫ్ట్‌ మద్దతు: బొత్స
X
జగన్ దీక్ష రాజకీయ స్వార్థంతో చేస్తున్నది కాదని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే రాజకీయాలను పక్కనపెడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం ఏ పార్టీ కలిసొచ్చినా కలుపుకెళతామని చెప్పారు. ఐదు వేల మందితో సోమవారం ఢిల్లీలో జగన్ దీక్ష జరుగుతుందని బొత్స తెలిపారు. సీపీఎం, సీపీఐ నేతలతో జగన్ మాట్లాడారనీ, జగన్ దీక్షకు సీపీఎం, సీపీఐ మద్దతు పలికాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెబుతూ వచ్చిన ఎన్డీఏ సర్కార్‌ ఇపుడు మాట మార్చిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు అని పేర్కొన్నారు. హోదా ఇవ్వడం సాధ్యం కాదని పార్లమెంట్‌లో మంత్రి చెప్పినా రాష్ట్రానికి చెందిన మంత్రులు నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఉద్యమంలో రాజకీయ స్వార్థం లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో భారతీయ జనతాపార్టీతో అధికారాన్ని పంచుకుంటున్న తెలుగుదేశం ఆ పార్టీని ఎందుకు నిలదీయలేక పోతుందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ప్రజావాణిని వినిపించాలని తమ పార్టీ నిర్ణయించిందని బొత్స అన్నారు. రాజకీయ వ్యాపారంలో టీడీపీ ప్రత్యేక హోదాను మరిచిందని, అందుకే తాము ముందుండి ఉద్యమాన్ని నడిపించాల్సి వస్తోందని ఆయన అన్నారు.
First Published:  8 Aug 2015 5:25 AM GMT
Next Story