Telugu Global
Cinema & Entertainment

మరో బాలీవుడ్ సినిమాలో రానా

బాహుబలి సినిమాలో భళ్లాలదేవగా మెప్పించిన రానా ఇప్పుడు మరోసారి బాలీవుడ్ పై దృష్టిపెట్టాడు. బాహుబలి హిందీ వెర్షన్ తో బాలీవుడ్ లో మరింత పేరుతెచ్చుకున్న ఈ పొడుగాటి హీరో, ఇప్పుడు మరోసారి అక్షయ్ కుమార్ తో కలిసి నటించడానికి సిద్ధమౌతున్నాడు. మరాఠిలో హిట్టయిన ఓ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి అంగీకరించాడు అక్షయ్ కుమార్. ఆ సినిమాలో ఓ కీలకపాత్రకు రానా ఎంపికయ్యాడు. సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. గోపీ గణేష్ దర్శకత్వంలో రాబోతున్న […]

మరో బాలీవుడ్ సినిమాలో రానా
X
బాహుబలి సినిమాలో భళ్లాలదేవగా మెప్పించిన రానా ఇప్పుడు మరోసారి బాలీవుడ్ పై దృష్టిపెట్టాడు. బాహుబలి హిందీ వెర్షన్ తో బాలీవుడ్ లో మరింత పేరుతెచ్చుకున్న ఈ పొడుగాటి హీరో, ఇప్పుడు మరోసారి అక్షయ్ కుమార్ తో కలిసి నటించడానికి సిద్ధమౌతున్నాడు. మరాఠిలో హిట్టయిన ఓ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి అంగీకరించాడు అక్షయ్ కుమార్. ఆ సినిమాలో ఓ కీలకపాత్రకు రానా ఎంపికయ్యాడు. సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. గోపీ గణేష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు డార్లింగ్ స్వామి ఒరిజినల్ కథ అందించాడు. ఈ సినిమాకు సంబంధించి నూతన నటీనటుల్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని రానా తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేశాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తమ వీడీయోలు, ఫొటోల్ని పంపించాలని కోరాడు. సినిమాకు పోస్టర్ బాయ్స్ అని పేరుపెట్టారు. ఈమెయిల్ అడ్రస్ – పోస్టర్ బాయ్స్ @ సురేష్ ప్రొడక్షన్స్.కామ్
First Published:  6 Aug 2015 9:12 PM GMT
Next Story