Telugu Global
Cinema & Entertainment

లండన్ లో ఎన్టీఆర్ ఉత్సాహం.. ?

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. దాదాపు ఈ నెలంతా లండన్ లోనే షూటింగ్ ఉంటుంది. ఈమధ్య తన కొడుకు పుట్టినరోజు వేడుకను కూడా లండన్ లోనే సెలబ్రేట్ చేశాడు ఎన్టీఆర్. పుట్టినరోజు తర్వాత మరింత ఫ్రెష్ గా, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాడు. ఈవిషయాన్ని దర్శకుడు సుకుమార్ స్వయంగా వెల్లడించాడు. అభిరామ్ బర్త్ డే తర్వాత ఎన్టీఆర్ మరింత యంగ్ అయిపోయాడని, రెట్టించిన ఉత్సాహంతో […]

లండన్ లో ఎన్టీఆర్ ఉత్సాహం.. ?
X
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. దాదాపు ఈ నెలంతా లండన్ లోనే షూటింగ్ ఉంటుంది. ఈమధ్య తన కొడుకు పుట్టినరోజు వేడుకను కూడా లండన్ లోనే సెలబ్రేట్ చేశాడు ఎన్టీఆర్. పుట్టినరోజు తర్వాత మరింత ఫ్రెష్ గా, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాడు. ఈవిషయాన్ని దర్శకుడు సుకుమార్ స్వయంగా వెల్లడించాడు. అభిరామ్ బర్త్ డే తర్వాత ఎన్టీఆర్ మరింత యంగ్ అయిపోయాడని, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. దీంతో షూటింగ్ అనుకున్న సమయం కంటే కాస్త ముందే పూర్తయ్యే ఛాన్స్ ఉందంటున్నాడు సుకుమార్. ప్రస్తుతం లండన్ లో ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నారు. దీంతో సెట్ లో అంతా సందడిగా మారిపోతోంది. ప్రస్తుతం ఈ ముగ్గురి మధ్య వచ్చే కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా యూనిట్ ఇండియా వచ్చిన తర్వాత టైటిల్ పై ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు నాన్నకు ప్రేమతో.. అనే పేరును అనుకుంటున్నారు. కానీ ఈ టైటిల్ ను మార్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
First Published:  6 Aug 2015 9:48 PM GMT
Next Story