Telugu Global
Others

బీహార్ ఎన్నికల అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా: కామినేని

భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన బిల్లు సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో డిమాండ్‌ చేసింది బీజేపీయేనని కామినేని అన్నారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు విభజన చట్టంలో చేర్చలేదని మంత్రి ప్రశ్నించారు. బీహార్‌ ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా వస్తుందని ఆశిస్తున్నాని ఆయన చెప్పారు. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో […]

బీహార్ ఎన్నికల అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా: కామినేని
X
భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన బిల్లు సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో డిమాండ్‌ చేసింది బీజేపీయేనని కామినేని అన్నారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు విభజన చట్టంలో చేర్చలేదని మంత్రి ప్రశ్నించారు. బీహార్‌ ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా వస్తుందని ఆశిస్తున్నాని ఆయన చెప్పారు. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో మెడికల్ కాలేజీలు ఎక్కువ ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు ఈ సందర్భంగా మంత్రి కామినేని హెచ్చరించారు.
First Published:  6 Aug 2015 1:13 PM GMT
Next Story