Telugu Global
Others

ఇక‌ మీ పీఎఫ్ డ‌బ్బులు స్టాక్ మార్కెట్లోకి...

ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ గురువారం చ‌రిత్రాత్మ‌క‌మైన అడుగు వేసింది. తొలిసారిగా స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో 5000 కోట్లు పెట్టుబడి పెట్టాల‌ని రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. క్ర‌మ‌క్ర‌మంగా స్టాక్‌మార్కెట్స్‌లో పెట్టుబ‌డుల‌ను పెంచ‌నుంద‌నీ కేంద్ర కార్మిక‌శాఖ మంత్రి బండారు ద‌త్తాత్రేయ వెల్ల‌డించారు. దీనివ‌ల్ల పీఎఫ్ ఖాతాదారుల‌కు రిట‌ర్న్స్ పెరుగుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల‌పై ప్ర‌స్తుతం 8.75 శాతం వ‌డ్డీ వ‌స్తోంది. ఈక్విటీ, ఈక్విటీ సంబంధ ప‌థ‌కాల్లో 5 నుంచి […]

ఇక‌ మీ పీఎఫ్ డ‌బ్బులు స్టాక్ మార్కెట్లోకి...
X

ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ గురువారం చ‌రిత్రాత్మ‌క‌మైన అడుగు వేసింది. తొలిసారిగా స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో 5000 కోట్లు పెట్టుబడి పెట్టాల‌ని రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. క్ర‌మ‌క్ర‌మంగా స్టాక్‌మార్కెట్స్‌లో పెట్టుబ‌డుల‌ను పెంచ‌నుంద‌నీ కేంద్ర కార్మిక‌శాఖ మంత్రి బండారు ద‌త్తాత్రేయ వెల్ల‌డించారు. దీనివ‌ల్ల పీఎఫ్ ఖాతాదారుల‌కు రిట‌ర్న్స్ పెరుగుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల‌పై ప్ర‌స్తుతం 8.75 శాతం వ‌డ్డీ వ‌స్తోంది.

ఈక్విటీ, ఈక్విటీ సంబంధ ప‌థ‌కాల్లో 5 నుంచి 15 శాతం పెట్టుబ‌డి పెట్ట‌డానికి కార్మిక‌శాఖ‌ ఇపిఎఫ్‌వోకు అనుమ‌తి ఇచ్చింది. అయితే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో త‌మ ఇన్‌క్రెమెంట్ డిపాజిట్ల‌లో 5శాతం మాత్ర‌మే స్టాక్ మార్కెట్‌లో పెట్టాల‌ని ఇపిఎఫ్‌వో నిర్ణ‌యించింది.

6 కోట్ల ఖాతాదారులు..రూ.8.9ల‌క్ష‌ల కోట్ల నిధులు:
ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఇపిఎఫ్‌వో) ఆధీనంలో 8.9ల‌క్ష‌ల కోట్ల నిధులున్నాయి. వాటిలో ఎక్కువ‌శాతం గ‌వ‌ర్న‌మెంట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్‌చేస్తూ వ‌స్తోంది. ఆరు కోట్ల ఖాతాదారుల‌కు చెందిన సొమ్ముకు భ‌ద్ర‌త క‌ల్పిస్తోంది. తాజాగా ఇపిఎఫ్‌వో.. ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయ‌డం మొద‌లుపెట్టింది. అటు ఎస్‌బిఐకి చెందిన‌ ఎసెట్ మేనేజ్‌మెంట్ విభాగం ఇపిఎఫ్‌వో ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ని నిర్వ‌హిస్తుంది.

ఫండ్స్‌కి సోర్స్‌గా మార‌నున్న ఇపిఎఫ్‌వో… మార్కెట్ విశ్లేష‌కుల హ‌ర్షం:
గ‌త ఏడాది వ‌ర‌కు డాల‌ర్ టర్మ్స్‌తో పోలిస్తే ఇండియ‌న్ షేర్స్ ఆసియాలోనే సెకండ్ బెస్ట్‌గా నిలిచాయి. అయితే ఈ మార్చి నుంచి మార్కెట్లో ఉత్థాన‌ప‌త‌నాలు ఆందోళ‌న క‌ల్గిస్తున్నాయి. అయితే స్టాక్స్‌ని కొనాల‌ని పెన్ష‌న్ ఫండ్ సంస్థ తీసుకున్న నిర్ణ‌యంపై మార్కెట్ విశ్లేష‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకుల‌కు గురైన స‌మ‌యంలో ఎల్ఐసి మాదిరిగా ఇపిఎఫ్‌వో కూడా ఫండ్స్‌కి సోర్స్‌గా మార‌నుంది.

అయితే ఇనీఫియ‌ల్ అమౌంట్‌పై కొంద‌రు మార్కెట్ నిపుణులు అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. ఈక్విటీల్లో ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. 2015లో ఎల్ఐసి మొద‌టిసారి 47000 కోట్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింద‌నీ., ఆ విలువ‌తో ఇపిఎఫ్‌వో పెట్టుబ‌డి పెట్టిన 5000 కోట్లు చాలా త‌క్కువ‌ని చెబుతున్నారు.

First Published:  7 Aug 2015 1:09 AM GMT
Next Story