Telugu Global
NEWS

మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు... సీఐ సస్పెన్షన్‌

గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్‌ సీఐ శరత్‌బాబు తనను లైంగికంగా వేధిస్తూ అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించారంటూ మహిళా కానిస్టేబుల్‌ నాగశ్వేత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శరత్‌బాబు రెండు నెలలుగా తనను వేధిస్తున్నారంటూ ఆయన నుంచి తనకు వచ్చిన మెసెజ్‌లను ఎస్పీకి చూపించారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి రూరల్ సీఐ శరత్‌బాబును సస్పెండ్ చేశామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ఠాగూర్ తెలియజేశారు. సీఐ వ్యవహారంపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, విచారణాధికారిగా అడిషనల్‌ ఎస్పీ శోభామంజరిని నియమించామని […]

మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు... సీఐ సస్పెన్షన్‌
X
గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్‌ సీఐ శరత్‌బాబు తనను లైంగికంగా వేధిస్తూ అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించారంటూ మహిళా కానిస్టేబుల్‌ నాగశ్వేత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శరత్‌బాబు రెండు నెలలుగా తనను వేధిస్తున్నారంటూ ఆయన నుంచి తనకు వచ్చిన మెసెజ్‌లను ఎస్పీకి చూపించారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి రూరల్ సీఐ శరత్‌బాబును సస్పెండ్ చేశామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ఠాగూర్ తెలియజేశారు. సీఐ వ్యవహారంపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, విచారణాధికారిగా అడిషనల్‌ ఎస్పీ శోభామంజరిని నియమించామని రూరల్‌ ఎస్పీ నారాయణ నాయక్‌ చెప్పారు.
First Published:  7 Aug 2015 1:04 AM GMT
Next Story