Telugu Global
Others

రాజ‌ధాని రైతుల‌కు శుభ‌వార్త‌

భూసేక‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డే అవకాశం న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త రాజ‌ధాని నిర్మాణం కోసం బ‌డుగు రైతుల నుంచి భూములు లాక్కుంటున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. భూసేక‌ర‌ణ ఆర్డినెన్స్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. అదే జ‌రిగితే రాజ‌ధాని రైతుల‌కు శుభ‌వార్తే. ఇప్ప‌టివ‌ర‌కు భూ స‌మీక‌ర‌ణ ద్వారా 22 వేల ఎక‌రాల‌ను స‌మీక‌రించిన ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇంకో 22 వేల ఎక‌రాల‌ను భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌యోగించి సేక‌రించాల‌ని భావించింది. అయితే భూసేక‌ర‌ణ స‌వ‌ర‌ణ చ‌ట్టం […]

రాజ‌ధాని రైతుల‌కు శుభ‌వార్త‌
X
భూసేక‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డే అవకాశం
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త రాజ‌ధాని నిర్మాణం కోసం బ‌డుగు రైతుల నుంచి భూములు లాక్కుంటున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. భూసేక‌ర‌ణ ఆర్డినెన్స్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. అదే జ‌రిగితే రాజ‌ధాని రైతుల‌కు శుభ‌వార్తే. ఇప్ప‌టివ‌ర‌కు భూ స‌మీక‌ర‌ణ ద్వారా 22 వేల ఎక‌రాల‌ను స‌మీక‌రించిన ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇంకో 22 వేల ఎక‌రాల‌ను భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌యోగించి సేక‌రించాల‌ని భావించింది. అయితే భూసేక‌ర‌ణ స‌వ‌ర‌ణ చ‌ట్టం – 2013ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తుండ‌డంతో ఆ ఎత్తుగ‌డ‌ల‌కు బ్రేక్ ప‌డ‌బోతోంది. ఇప్ప‌టికి మూడుసార్లు ప్ర‌య‌త్నించినా భూసేక‌ర‌ణ ఆర్డినెన్స్ పార్ల‌మెంటులో ఆమోదం పొందే అవ‌కాశం క‌నిపించ‌క‌పోవ‌డంతో ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్లు అధికార‌వ‌ర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా ఉప‌సంహ‌రించుకోకుండా వివాదాస్ప‌ద‌మైన కీల‌కాంశాల‌ను స‌డ‌లించినా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం భూసేక‌ర‌ణ కోసం ఇప్ప‌టికే జారీ చేసిన నోటిఫికేష‌న్‌కు విలువ లేకుండా పోతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. కేంద్రం స‌వ‌ర‌ణ‌ల‌తో జారీచేసిన ఆర్డినెన్స్ ను ఉప‌సంహ‌రించుకుంటే 2013 నాటి భూసేక‌ర‌ణ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చేస్తుంది. ఆ చ‌ట్టం ప్ర‌కార‌మైతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రైతుల‌కు భారీగా ప‌రిహారం, పున‌రావాస ఖ‌ర్చులు చెల్లించాల్సి ఉంటుంది. 11 వేల ఎక‌రాలు సేక‌రించాలంటే 60 వేల కోట్ల ప‌రిహారం, మ‌రో 30 వేల కోట్ల మేర‌కు పున‌రావాస ఖ‌ర్చులు చెల్లించాల్సి ఉంటుంద‌ట‌. అంటే 22 వేల ఎక‌రాలంటే ఇది రెట్టింపు చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు రెండు ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల‌కు జీతాల‌కే ఠికాణా లేక‌పోయినా ఇప్ప‌టికే వంద‌ల కోట్ల రూపాయ‌లు దుబారా చేస్తున్న చంద్ర‌బాబు నాయుడు బ‌డ్జెట్‌లో రెవెన్యూ లోటును ఎలా భ‌ర్తీ చేయాల‌నేదానిపై దిగాలుగా ఉన్నారు. రెండు ల‌క్ష‌ల కోట్లు రైతుల‌కే చెల్లించే ప‌రిస్థితి అస‌లు ఊహించ‌డానికే క‌ష్టం. అందువ‌ల్ల భూసేక‌ర‌ణ జోలికి వెళ్ల‌కుండా ఉండ‌డ‌మే మేల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావించ‌డం త‌థ్యం. కాబ‌ట్టి త‌మ పంట భూములు లాక్కుంటున్నార‌ని మ‌ద‌న‌ప‌డుతున్న‌ రాజ‌ధాని రైతుల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే.
First Published:  6 Aug 2015 9:34 PM GMT
Next Story