Telugu Global
Others

రిషితేశ్వరి కేసు... వైసీపీ ఆందోళన బాట

ర్యాగింగ్ భూతానికి బలైపోయిన విద్యార్థిని రిషితేశ్వరి కేసులో ప్రభుత్వ సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గురువారం నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఈ కేసులో యూనివర్శిటీ వీసీని రెండో ముద్దాయిగా చేర్చాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రిన్సిపాల్‌ బాబూరావును వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్‌ చేశారు. సిటింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరపాలని, చంద్రబాబు నాయుడు బంధువని చెప్పుకుంటున్న ప్రిన్సిపల్‌ బాబూరావుపై చర్యలు తీసుకోవాలని, రిషితేశ్వరి రాసిందని […]

రిషితేశ్వరి కేసు... వైసీపీ ఆందోళన బాట
X
ర్యాగింగ్ భూతానికి బలైపోయిన విద్యార్థిని రిషితేశ్వరి కేసులో ప్రభుత్వ సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గురువారం నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఈ కేసులో యూనివర్శిటీ వీసీని రెండో ముద్దాయిగా చేర్చాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రిన్సిపాల్‌ బాబూరావును వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్‌ చేశారు. సిటింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరపాలని, చంద్రబాబు నాయుడు బంధువని చెప్పుకుంటున్న ప్రిన్సిపల్‌ బాబూరావుపై చర్యలు తీసుకోవాలని, రిషితేశ్వరి రాసిందని చెబుతున్న రెండు లేఖలను ఆధారం చేసుకుని దర్యాప్తు కొనసాగాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు డిమాండు చేశారు.
కాంగ్రెస్‌దీ అదే మాట…
నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్క్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై న్యాయవిచారణ జరపాలని , ప్రిన్సిపాల్‌ను అరెస్ట్‌ చేయాలంటూ గురువారం యూనివర్సిటీ వద్ద కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. గేటు లోపలికి వెళ్లేందుకు యత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో కాంగ్రెస్‌ నేతలు వర్శిటీ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలను పోలీసులు లోనికి అనుమతించారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా అక్కడకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేతల బృందాన్ని పోలీసులు ప్రత్యేక బస్సులో యూనివర్సిటీలోనికి అనుమతించారు.
ర్యాగింగ్‌ నిరోధానికి చర్యలు : చినరాజప్ప
ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్‌ నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. యూనివర్శిటీలోకి 20 మందిని అనుమతిస్తే వందమందితో వెళ్లి రోజా రాజకీయం చేయడం సరికాదన్నారు. సమస్యను సామాజిక కోణంలో చూడకుండా రాజకీయం చేయడం మంచిది కాదని చినరాజప్ప అన్నారు.
సస్పెండైన ప్రిన్సిపాల్‌పై రిజిస్టార్‌ ఫిర్యాదు
కాగా ఏఎన్‌యూ విద్యార్థిని ఆత్మహత్య కేసులో సస్పెండైన ప్రిన్సిపాల్‌ బాబూరావుపై రిజిస్టార్‌ రాజశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీలో ర్యాగింగ్‌ను బాబూరావు నిరోధించ లేకపోయారని ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిపించాలని రిజిస్టార్‌ రాజశేఖర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
First Published:  6 Aug 2015 5:11 AM GMT
Next Story