Telugu Global
Cinema & Entertainment

శ్రీమంతుడు ఈ సారికి అలా అనుకుందామా ?  

శ్రీ‌మంతుడి సినిమా  ఎలా వుంటుందో.. ఎలా చేశాడో.. ఏ రేంజ్ స‌క్సెస్  అవుతుందో..  అనే సందేహాలు ప్రస్తుతం  మ‌హేష్ బాబు అభిమానుల బుర్రలు తొలుస్తున్న విషయం. ఎందుకంటే  సినిమా రేపు  రిలీజ్ అవుతుంది.  అయితే అటువంటి సందేహాలు ఏమి అవ‌సరమే లేదు,  బొమ్మ దుమ్ము లేప‌డం ఖాయ‌మ‌ని  శ్రీ‌మంతుడు టీమ్ అంతా  భ‌రోసా ఇస్తున్నారు.  ఎవ‌రెన్ని చెప్పిన  సినిమా జాత‌కాన్ని డిసైడ్ చేయాల్సింది ఫైన‌ల్ గా ఆడియ‌న్సే. ఇదిలా వుంటే..  శ్రీ‌మంతుడు సినిమాకు ఒక ప్ర‌త్యేకత ఉంది. […]

శ్రీమంతుడు ఈ సారికి అలా అనుకుందామా ?  
X
శ్రీ‌మంతుడి సినిమా ఎలా వుంటుందో.. ఎలా చేశాడో.. ఏ రేంజ్ స‌క్సెస్ అవుతుందో.. అనే సందేహాలు ప్రస్తుతం మ‌హేష్ బాబు అభిమానుల బుర్రలు తొలుస్తున్న విషయం. ఎందుకంటే సినిమా రేపు రిలీజ్ అవుతుంది. అయితే అటువంటి సందేహాలు ఏమి అవ‌సరమే లేదు, బొమ్మ దుమ్ము లేప‌డం ఖాయ‌మ‌ని శ్రీ‌మంతుడు టీమ్ అంతా భ‌రోసా ఇస్తున్నారు. ఎవ‌రెన్ని చెప్పిన సినిమా జాత‌కాన్ని డిసైడ్ చేయాల్సింది ఫైన‌ల్ గా ఆడియ‌న్సే.
ఇదిలా వుంటే.. శ్రీ‌మంతుడు సినిమాకు ఒక ప్ర‌త్యేకత ఉంది. మ‌హేష్ బాబు బ‌ర్త్ డే (ఆగ‌స్టు9) కు ముందు రిలీజ్ అవుతుంది. గ‌త యేడాది చేసిన రెండు చిత్రాలు ( నేనొక్క‌డినే, ఆగ‌డు)అభిమానుల్ని డిజ‌పాయింట్ చేయ‌డంతో.. ఫ్యాన్స్ శ్రీ‌మంతుడి పై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. మ‌హేష్ బాబు కూడా మంచి హిట్ అందించాల‌నే త‌ప‌న‌తో చేశాడు. అన్నింటికి మించి రెండో సినిమాతో కూడా త‌న స‌త్తాను మ‌రింత‌గా చాటుకోవాల్సిన ప్రెజ‌ర్ డైరెక్ట‌ర్ పై ఇండైరెక్ట్ గా ఉంది. సో .. ఎలా చూసుకున్న శ్రీమంతుడు వెరీ వెరీ స్పెష‌ల్. మ‌రి శ్రీ‌మంతుడు చిత్రం నిజంగా మ‌హేష్ బాబు త‌న అభిమానుల‌కు త‌న బ‌ర్త్ డే గిఫ్ట్ అనే చెప్పాలి క‌దా.!
Next Story