Telugu Global
Cinema & Entertainment

అందరు హీరోల కథలు వరుణ్ తేజకే

వరుణ్ తేజ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. ఈమధ్యే క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా పూర్తిచేశాడు వరుణ్ తేజ. నిజానికి ఈ సినిమాను బాలీవుడ్ లో తీయాలనుకున్నాడట క్రిష్. కుదిరితే సల్మాన్ లేకపోతే అక్షయ్ కుమార్ తో కంచె కథను తెరకెక్కించాలనుకున్నాడు. కానీ అతడి బాలీవుడ్ డెబ్యూ బెడిసికొట్టడంతో టాలీవుడ్ కొచ్చి కంచె కథను వరుణ్ తేజతో తెరకెక్కించాడు. ఇక ప్రస్తుతం వరుణ్ చేస్తున్న లోఫర్ సినిమా కూడా […]

అందరు హీరోల కథలు వరుణ్ తేజకే
X
వరుణ్ తేజ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. ఈమధ్యే క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా పూర్తిచేశాడు వరుణ్ తేజ. నిజానికి ఈ సినిమాను బాలీవుడ్ లో తీయాలనుకున్నాడట క్రిష్. కుదిరితే సల్మాన్ లేకపోతే అక్షయ్ కుమార్ తో కంచె కథను తెరకెక్కించాలనుకున్నాడు. కానీ అతడి బాలీవుడ్ డెబ్యూ బెడిసికొట్టడంతో టాలీవుడ్ కొచ్చి కంచె కథను వరుణ్ తేజతో తెరకెక్కించాడు. ఇక ప్రస్తుతం వరుణ్ చేస్తున్న లోఫర్ సినిమా కూడా నితిన్ కోసం సిద్ధంచేసిందనే ప్రచారం సాగుతోంది. హార్ట్ ఎటాక్ తర్వాత నితిన్-పూరి జగన్నాధ్ కాంబోలో మరో సినిమా వస్తుందని స్వయంగా నితినే ప్రకటించాడు. పూరి కూడా కథ సిద్ధం చేశాడు. కానీ ఆఖరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు నితిన్ ప్రకటించాడు. ఆ కథతోనే వరుణ్ తేజతో లోఫర్ సినిమా చేస్తున్నాడని సమాచారం. ఇక మూడో సినిమా విషయానికొస్తే.. ఈ మధ్యే ఎన్టీఆర్ కు మరో కథ వినిపించాడట పూరి జగన్నాధ్. టెంపర్ తర్వాత ఆ కథతోనే మరో సినిమా చేద్దామని అనుకున్నారట. కానీ తారక్ మాత్రం సుకుమార్ సినిమాకు ఫిక్స్ అయ్యాడు. దీంతో ఎన్టీఆర్ కోసం అనుకున్నఆ కొత్త కథను కూడా వరుణ్ తేజతోనే తెరకెక్కించాలని అనుకుంటున్నాడట పూరి. లోఫర్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.
First Published:  5 Aug 2015 7:05 PM GMT
Next Story