Telugu Global
Others

సాంకేతిక విద్యలో మార్పు చేయండి: కేసీఆర్ 

ఇంజ‌నీరింగ్ విద్యార్ధులు హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులుగా ప‌ని చేయ‌డం సిగ్గుచేట‌ని, సాంకేతిక విద్య‌లో స‌మూల మార్పు చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల్లో ఎన్నో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలున్నాయి. వాటిపై దృష్టి పెట్టి, ఆయా రంగాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా కోర్సులు రూపొందించండ‌ని విద్యాశాఖ స‌మీక్షా  స‌మావేశంలో అన్నారు. కేజీ టూ పీజీ విద్య‌తోపాటు ఉన్న‌త విద్యారంగంపై అధికారుల‌తో సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు శాఖ‌ల కింద […]

సాంకేతిక విద్యలో మార్పు చేయండి: కేసీఆర్ 
X
ఇంజ‌నీరింగ్ విద్యార్ధులు హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులుగా ప‌ని చేయ‌డం సిగ్గుచేట‌ని, సాంకేతిక విద్య‌లో స‌మూల మార్పు చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల్లో ఎన్నో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలున్నాయి. వాటిపై దృష్టి పెట్టి, ఆయా రంగాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా కోర్సులు రూపొందించండ‌ని విద్యాశాఖ స‌మీక్షా స‌మావేశంలో అన్నారు. కేజీ టూ పీజీ విద్య‌తోపాటు ఉన్న‌త విద్యారంగంపై అధికారుల‌తో సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు శాఖ‌ల కింద ఉన్న గురుకుల విద్యాసంస్థ‌ల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకు రావాల‌ని ఆదేశించారు. హాస్ట‌లు విద్యార్ధుల‌కు భోజ‌నం గ్రాముల లెక్క‌ల్లో కాకుండా బ‌ఫే విధానంలో తిన్నంత పెట్టాల‌ని ఆదేశించారు.
First Published:  5 Aug 2015 1:05 PM GMT
Next Story