Telugu Global
Cinema & Entertainment

అలా స్టెప్ వేయడానికి 4 కోట్లు అడిగిందట...! 

అన్న స్టెప్పేస్తే  మాస్.. అన్న న‌డిచోస్తే మాస్ అంటూ లారెన్స్  మాస్ చిత్రంలో పాడించిన‌ట్లు..   బాలీవుడ్ హాట్ బ్యూటీ   జాక్విలిన్  ఫెర్నాండేజ్  స్టేప్పేస్తే నాలుగు కోట్లు పే చేయాల్సిందేన‌ట‌.  బాబోయ్ ఇది  టాప్ హీరోయిన్  రెమ్యున్ రేష‌న్ క‌దా.. ఓన్లీ స్టెప్పేస్తే అంత రెమ్యునరేష‌న్ ఎలా ఇస్తున్నార‌బ్బా అనే సందేహాం అవ‌స‌రం లేదండోయ్. ఎందుకంటే..ఈ రెమ్యున్ రేష‌న్ ఇచ్చేది నిర్మాత‌ల కాదు మ‌రి. బిజినెస్ మాగ్నైట్స్. నిజ‌మే.. లండ‌న్ లో  ఎన్ఆర్ఐ బిజినెస్ పీపుల్ త‌మ […]

అలా స్టెప్ వేయడానికి 4 కోట్లు అడిగిందట...! 
X
అన్న స్టెప్పేస్తే మాస్.. అన్న న‌డిచోస్తే మాస్ అంటూ లారెన్స్ మాస్ చిత్రంలో పాడించిన‌ట్లు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్ స్టేప్పేస్తే నాలుగు కోట్లు పే చేయాల్సిందేన‌ట‌. బాబోయ్ ఇది టాప్ హీరోయిన్ రెమ్యున్ రేష‌న్ క‌దా.. ఓన్లీ స్టెప్పేస్తే అంత రెమ్యునరేష‌న్ ఎలా ఇస్తున్నార‌బ్బా అనే సందేహాం అవ‌స‌రం లేదండోయ్. ఎందుకంటే..ఈ రెమ్యున్ రేష‌న్ ఇచ్చేది నిర్మాత‌ల కాదు మ‌రి. బిజినెస్ మాగ్నైట్స్. నిజ‌మే.. లండ‌న్ లో ఎన్ఆర్ఐ బిజినెస్ పీపుల్ త‌మ సంతానం ( అబ్బాయి లేదా అమ్మాయి ) మ్యారేజెస్ లో సెలిబ్రిటీల సందడి కావాల‌నుకుంటే వెంట‌నే బాలీవుడ్ సెలిబ్రిటీలని అప్రోచ్ కావ‌డం సాధ‌ర‌ణంగా జ‌ర‌గుతున్న విష‌య‌మే. ఎక్కువగా షారుక్ ఖాన్ ఈ త‌ర‌హా మ్యారేజెస్ కు అటెండ్ అవుతుంటాడు. త‌న రేంజ్ కు త‌గ్గ‌కుండా.. రెమ్యునరేష‌న్ కోట్ల‌లో తీసుకుంటాడు.

ఇక తాజా విశేషం ఏమిటంటే..హాట్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్.. లండ‌న్ లో ఒక సంపన్న భార‌తీయ బిజినెస్ మెన్ కొడుకు పెళ్లిలో స్టెప్ వేయ‌డానికి ఏకంగా 4 కోట్లు తీసుకుంటుంద‌ట‌. న‌టిగా ఫుల్ బిజీగా వున్న జాక్విలిన్.. ఇటువంటి బంప‌ర్ ఆఫ‌ర్స్ ను ఏ మాత్రం వ‌ద‌లుకోవ‌డం లేదు. ఎందుకంటే.. ఒక్క‌రోజు పెళ్లిలో సంద‌డి చేస్తే.. 4 కోట్లు క‌దా. రెమ్యునరేషనే కాకుండ‌…రెండు రోజుల‌కు స‌రిప‌డ స్టార్ హోట‌ల్ లో స్టే చేయ‌డానికి అయ్యే ఖ‌ర్చు కూడా ఒప్పందం కుదుర్చుకున్న వాళ్లే పే చేయాల‌ట‌. జాక్విలిన్ కు హీరోయిన్ గా చేసిన ఇంత రెమ్యున్ రేష‌న్ రావాలంటే క‌నీసం అర‌డ‌జ‌ను చిత్రాల్లో న‌టించాలి. కానీ.. ఇటువంటి ఆఫ‌ర్స్ వ‌స్తే మాత్రం జాక్ పాట్ త‌గిలిన‌ట్లే . ఎంతైనా జాక్విలిన్ ..వెరీ హాట్ బ్యూటీ క‌దా..! ఆ మాత్రం రెమ్యున్ రేష‌న్ ఉండాల్సిందే.
Next Story