Telugu Global
National

వ‌సీం అక్రంపై కాల్పులు!

పాకిస్తాన్ క్రికెట‌ర్ వ‌సీం అక్రంపై ఓ దుండ‌గుడు క‌రాచీలో కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో వ‌సీం ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. బుధ‌వారం ఉద‌యం జాతీయ క్రికెట్ స్టేడియం వద్దకు తన కారులో చేరుకునే స‌మ‌యంలో ఓ కారు వ‌చ్చి వ‌సీం కారును ఢీకొట్టింది. ఆ కారులో ఉన్న వ్య‌క్తి వెంట‌నే కారు దిగి వ‌సీంపై కాల్పుల‌కు దిగాడు. అయితే చుట్టుప‌క్క‌ల ఉన్న‌వారు కారులో ఉంది వ‌సీం అని అర‌వ‌డంతో ఆ వ్య‌క్తి కేవ‌లం కారును […]

వ‌సీం అక్రంపై కాల్పులు!
X
పాకిస్తాన్ క్రికెట‌ర్ వ‌సీం అక్రంపై ఓ దుండ‌గుడు క‌రాచీలో కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో వ‌సీం ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. బుధ‌వారం ఉద‌యం జాతీయ క్రికెట్ స్టేడియం వద్దకు తన కారులో చేరుకునే స‌మ‌యంలో ఓ కారు వ‌చ్చి వ‌సీం కారును ఢీకొట్టింది. ఆ కారులో ఉన్న వ్య‌క్తి వెంట‌నే కారు దిగి వ‌సీంపై కాల్పుల‌కు దిగాడు. అయితే చుట్టుప‌క్క‌ల ఉన్న‌వారు కారులో ఉంది వ‌సీం అని అర‌వ‌డంతో ఆ వ్య‌క్తి కేవ‌లం కారును కాల్చి వెనుదిరిగాడు. అదృష్ట‌వ‌శాత్తూ ఈ కాల్పుల్లో వ‌సీంకు ఎలాంటి గాయాలు కాలేదు. వ‌సీం ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. కావాల‌నే దాడి జ‌రిగిందా? లేదా క్ష‌ణికావేశంలో జ‌రిగిన సంఘ‌ట‌నా? అన్న విష‌యంపై విచార‌ణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇప్ప‌టికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఘ‌ట‌న‌పై పాక్ క్రికెట‌ర్లు స్పందించారు. కార‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.
First Published:  5 Aug 2015 11:51 PM GMT
Next Story