Telugu Global
Others

ఉద్యోగులంతా ఒకేసారి ఏపీకి 

రాజ‌ధానికి ఉద్యోగులంద‌రినీ ఒకేసారి త‌ర‌లిస్తామ‌ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు ఆయన ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో చ‌ర్చించారు. ఒకేసారి కాకుండా ద‌శ‌లవారీగా త‌ర‌లించాల‌న్న ఉద్యోగసంఘాల నేత‌ల ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆయ‌న తిర‌స్క‌రించారు. ఉద్యోగుల పిల్లల స్థానిక‌త‌, హెచ్ఆర్ 30 శాతం అంశాల‌పై ముఖ్య‌మంత్రి ప‌రిశీలిస్తార‌ని ఆయ‌న అన్నారు. సీఎం కూడా విజ‌య‌వాడ వెళ్లేందుకు సిద్ధం కావ‌డంతో ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. ఉద్యోగుల పిల్లల స్థానికతకు […]

రాజ‌ధానికి ఉద్యోగులంద‌రినీ ఒకేసారి త‌ర‌లిస్తామ‌ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు ఆయన ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో చ‌ర్చించారు. ఒకేసారి కాకుండా ద‌శ‌లవారీగా త‌ర‌లించాల‌న్న ఉద్యోగసంఘాల నేత‌ల ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆయ‌న తిర‌స్క‌రించారు. ఉద్యోగుల పిల్లల స్థానిక‌త‌, హెచ్ఆర్ 30 శాతం అంశాల‌పై ముఖ్య‌మంత్రి ప‌రిశీలిస్తార‌ని ఆయ‌న అన్నారు. సీఎం కూడా విజ‌య‌వాడ వెళ్లేందుకు సిద్ధం కావ‌డంతో ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. ఉద్యోగుల పిల్లల స్థానికతకు సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని కృష్ణారావు తెలిపారు.
First Published:  5 Aug 2015 1:11 PM GMT
Next Story