Telugu Global
Cinema & Entertainment

సెన్సార్ పూర్తిచేసుకున్న శ్రీమంతుడు

మహేష్ బాబు-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన శ్రీమంతుడు సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సినిమాను ఆసాంతం చూసిన సెన్సార్ బోర్డు.. మూవీలో ఎలాంటి కట్స్ ప్రతిపాదించలేదు. కొన్ని సన్నివేశాల్ని దృష్టిలో పెట్టుకొని క్లీన్-యు సర్టిఫికేట్ మాత్రం జారీచేయలేదు. సెన్సార్ బోర్డు అనుమతి లభించడంతో శ్రీమంతుడు రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇప్పటికేవిడుదలైన పాటలకు […]

సెన్సార్ పూర్తిచేసుకున్న శ్రీమంతుడు
X
మహేష్ బాబు-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన శ్రీమంతుడు సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సినిమాను ఆసాంతం చూసిన సెన్సార్ బోర్డు.. మూవీలో ఎలాంటి కట్స్ ప్రతిపాదించలేదు. కొన్ని సన్నివేశాల్ని దృష్టిలో పెట్టుకొని క్లీన్-యు సర్టిఫికేట్ మాత్రం జారీచేయలేదు. సెన్సార్ బోర్డు అనుమతి లభించడంతో శ్రీమంతుడు రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇప్పటికేవిడుదలైన పాటలకు మంచి హిట్ టాక్ రావడంతో, సినిమాపై అంచనాలు పెరిగాయి. మహేష్ లుంగీతో కనిపించిన స్టిల్ ను తాజాగా విడుదలచేసి సినిమాపై అంచనాల్ని మరింత పెంచారు. విడుదలకు ముందు రోజు.. ఓ హిట్ సాంగ్ ను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఆగడు లాంటి ఫ్లాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు మహేష్ బాబు. సినిమాలో జగపతిబాబు, పూర్ణ, ఆమని, ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
Next Story