Telugu Global
Cinema & Entertainment

పార్ట్-2 కథ ముందే చెప్పేస్తా.. 

బాహుబలి సినిమా బంపర్ హిట్ అవ్వడంతో.. పార్ట్-2పై అంచనాలు ఆకాశాన్నంటాయి. సినిమా యూనిట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే పార్ట్-2పై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఇప్పుడీ మూవీపై తాజాగా మరో ప్రచారం కూడా ఊపందుకుంది. మొదటి భాగంలో కిలికి భాష పెట్టినట్టు, రెండో భాగంలో కూడా మరో కొత్త భాషను తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. దీనికి సంబంధించి యూనిట్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు మొదటిభాగంలో బాగా ఎలివేట్ అయిన కట్టప్ప […]

పార్ట్-2 కథ ముందే చెప్పేస్తా.. 
X
బాహుబలి సినిమా బంపర్ హిట్ అవ్వడంతో.. పార్ట్-2పై అంచనాలు ఆకాశాన్నంటాయి. సినిమా యూనిట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే పార్ట్-2పై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఇప్పుడీ మూవీపై తాజాగా మరో ప్రచారం కూడా ఊపందుకుంది. మొదటి భాగంలో కిలికి భాష పెట్టినట్టు, రెండో భాగంలో కూడా మరో కొత్త భాషను తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. దీనికి సంబంధించి యూనిట్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు మొదటిభాగంలో బాగా ఎలివేట్ అయిన కట్టప్ప పాత్రను రెండో భాగంలో చంపేస్తారట. రానా చేతిలో కట్టప్ప చనిపోతాడని తెలుస్తోంది. కట్టప్ప చనిపోయిన వెంటనే అస్లామ్ ఖాన్ (సుదీప్) వచ్చి బాహుబలి బ్యాచ్ లో చేరుతాడని ప్రచారం జరుగుతోంది. ఇలా బాహుబలి పార్ట్-2 కథకు సంబంధించి ఎంతో ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా ప్రచారం చేస్తున్న వాళ్లందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి పార్ట్-2 కథను విడుదలకు ముందే చెప్పేస్తానని ప్రకటించాడు. గతంలో ఈగ, మర్యాదరామన్న సినిమాలకు ఇదే ట్రెండ్ ఫాలో అయ్యాడు రాజమౌళి. సినిమా విడుదలకు ముందే పూసగుచ్చినట్టు కథ చెప్పేశాడు. ఇప్పుడు పార్ట్-2కు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతానంటున్నాడు.
First Published:  4 Aug 2015 7:04 PM GMT
Next Story